సైలెంట్ అయిన సునీల్ నారంగ్.. ఏంటి కారణం?

0

పెద్ద స్టార్ హీరోలు.. నిర్మాతలు.. సెలబ్రిటీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తూనే ఉంటారు. అయితే దాడులు ఆకస్మికంగా జరుగుతాయి కానీ తర్వాత మాత్రం దాడులు జరిగిన విషయం తెలిసిపోతుంది. ఈమధ్య ప్రముఖ టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ కం ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ ఆఫీసులపై ఐటీ శాఖ వారు దాడులు చేశారట. దాడుల్లో ఏం లభించిందనే విషయం ఐటీ అధికారులు వెల్లడించలేదు కానీ ఆ తర్వాత మాత్రం సునీల్ సైలెంట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది.

సడెన్ గా ఇలా సునీల్ పై దాడులు జరగడానికి కారణం ఏంటనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఐటీ వారికి టిప్ ఎవరు ఇచ్చారు..ఈ దాడులు సునీల్ పైనే జరిగాయా లేక ఆయనకు ఎఎంబీ సినిమాస్ లో బిజినెస్ పార్టనర్ మహేష్ బాబు ఇంటికి కూడా ఐటీవారు వెళ్ళారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే సునీల్ ఇప్పటికే కమిట్ అయిన సినిమాల పరిస్థితి ఏంటి.. అవి యథాతథంగా ఉంటాయా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.

దాడులు జరిగిన తర్వాత సునీల్ ఎందుకు సైలెంట్ అయ్యారు.. అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఐటీ దాడుల్లో ఏం జరిగింది.. సునీల్ ఎందుకు సైలెంట్ అయ్యారు అనే విషయం ఆయనే క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో.
Please Read Disclaimer