కొత్త బిరుదు.. సూపర్ స్టార్ కాదు.. సినిమా దేవుడట

0

భారత సినిమాకు ఐకానిక్ నటుల జాబితా తీస్తే అందు లో తప్పక ఉండే అతి కొద్ది పేర్లలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు ఒకటి. ప్రాంతాలకు.. భాషలకు అతీతంగా రజనీ స్టైల్ కు అభిమానులు బోలెడంతమంది ఉంటారు. డెబ్భైఏళ్ల వయసులోనూ తరగని ఉత్సాహం తో దూసుకెళుతున్న ఆయన.. తాజాగా దర్బార్ చిత్రంతో ప్రేక్షకులకు ముందుకు రానున్నారు. తమిళ ప్రజలు ఎంతో సంబరంగా చేసుకునే సంక్రాంతి పండక్కి వస్తున్న ఈ చిత్రం మీద అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ చిత్ర ప్రీరిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమం లో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దర్బార్ లో రజనీతో నటించిన బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి మాట్లాడుతూ.. రజనీ పై ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఇప్పటివరకూ ఎవరూ అనని వ్యాఖ్యను తొలిసారి రజనీని ఉద్దేశించి చేశారు.

రజనీకాంత్ ను అందరూ సూపర్ స్టార్ అంటారని.. కానీ తనకు మాత్రం సినిమా దేవుడంటూ వ్యాఖ్యానించారు. ఒక ప్రముఖ నటుడు.. మరో ప్రముఖ నటుడిని ఉద్దేశించి ఇంత భారీ వ్యాఖ్య చేయటం మామూలు విషయం కాదు. ఆ మాటకు వస్తే సునీల్ శెట్టి మాత్రమే కాదు.. ఈ చిత్ర కథానాయిక నివేదితా థామస్ సైతం ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

అందరికి ఎంతోమంది ఇష్టమైన కథానాయకులు ఉంటారని.. కానీ వారంతా మెచ్చిన నటుడు రజనీకాంత్ అని పేర్కొన్నారు. స్టార్ డైరెక్టర్ మురుగ దాస్ మాట్లాడుతూ.. తన కెరీర్ లో ముఖ్యమైన సినిమాగా పేర్కొన్నారు. పదమూడు సినిమాల తర్వాత రజనీకాంత్ సర్ తో పని చేసే అవకాశం లభించిందన్నారు. సినిమా వేడుకలు అంటేనే.. పొగడ్తలు కామన్. కానీ.. దర్బార్ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో మాత్రం అవి కాస్త పీక్స్ కు వెళ్లటం ఒక ఎత్తు అయితే.. అవన్నీ రజనీ లాంటి నటుడిని ఉద్దేశించి కాబట్టి ఓకే అనుకోవచ్చు.
Please Read Disclaimer