హీరో చొక్కా ఇస్త్రీ చేసిన నిర్మాత

0

హీరో షర్ట్ నిర్మాత ఇస్త్రీ చేయడమా.. అందుకు నామోషీ ఫీలవ్వరా? అంటే .. ఎందుకు ఫీలవ్వరు? అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం నామోషీ అవసరం లేదు. విక్టరీ వెంకటేష్ చొక్కాను తాను ఇస్త్రీ చేశానని .. ఒకరోజు కాదు ఏకంగా పది రోజుల పాటు ఇస్త్రీ చేశానని `ఓ బేబి` ఈవెంట్ లో చిత్రనిర్మాత సునీత తాటి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అసలు హీరో చొక్కా నిర్మాత ఇస్త్రీ చేయడమేంటి? వివరాల్లోకి వెళితే ఓ బేబి నిర్మాత సునీత పలు ఆసక్తికర సంగతుల్ని వెల్లడించారు.

నిర్మాత సునీత తాటి మాట్లాడుతూ “నాకు చిన్నప్పటి నుంచి హీరో వెంకటేష్ అంటే ఇష్టం. వెంకీ నటించిన `జయం మనదేరా`కు అసిస్టెంట్ డైరక్టర్ గా చేశాను. యూరప్ లో షూటింగ్ చేస్తుంటే వెంకటేష్ గారు నాకు షర్ట్ ఇచ్చి ఐరన్ చేస్తావా అని అడిగారు. అప్పటి నుంచి పది రోజులు నేనే ఐరన్ చేశాను“ అని తెలిపారు. అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో పైగా ఒక అభిమానిగా అప్పుడు వెంకీ షర్ట్ ఐరన్ చేశారన్నమాట. అసిస్టెంట్ స్థాయి నుంచి ఇప్పుడు ఏకంగా నిర్మాతగా ఎదగడం గొప్పే. సునీత తాటి ఇంకా చాలా సంగతులే చెప్పారు. “నా కెరీర్ మొదలైంది సురేష్ ప్రొడక్షన్స్ లో. పదేళ్ల తర్వాత `ఓ బేబి` సినిమాని నిర్మిస్తున్నందుకు.. సురేష్ బాబు గారితో కలిసి సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. 2016లోనే సమంతకు ఈ ప్రపోజల్ పెట్టాను. 2018లో తను మాటిచ్చింది. నందిని దర్శకత్వం చేయడానికి అంగీకరించారు. తను చాలా బాగా చేసింది. సమంత నాకు కొన్నేళ్లుగా తెలుసు. తనకున్న ప్యాషన్ – డెడికేషన్ నాకు బాగా తెలుసు. సమంత- నందిని చక్కగా పని చేశారు“ అని తెలిపారు.

ఓ బేబి ప్రీరిలీజ్ ముఖ్య అతిధి వెంకటేష్ మాట్లాడుతూ “ఒక అద్భుత కథతో కొత్త ప్రయోగం చేశారు. విభిన్నమైన క్లిష్టతతో కూడుకున్న కథ ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. నందిని చాలా బాగా హ్యాండిల్ చేసింది. ఎగ్జిక్యూషన్ బావుంది. మా బ్యానర్ తో కలిసి సునీత ఈ సినిమా చేశారు. నాకు అందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక సమంత బేబీ అదరగొట్టేసింది. తన కెరీర్ లోనే ఈ సినిమా బెస్ట్ గా ఉంటుంది. ఔట్ స్టాండింగ్.. ఎక్స్ ట్రార్డినరీ.. అన్ని ఎక్స్ ప్రెషన్స్ ను సమంత చాలెంజింగ్ గా తీసుకుని చేసింది“ అని అన్నారు.
Please Read Disclaimer