సకుటుంబ సమేతంగా సన్నీ హాలోవీన్ సంబరాలు

0

పాశ్చాత్య సంస్కృతి ధోరణులు భారతదేశంలో శరవేగంగా చొచ్చుకొచ్చాయి. హాలోవీన్ పండగ ఈ తరహానే. ప్రస్తుతం సెలబ్రిటీ ప్రపంచంలో హాలోవీన్ సందడి అంతకంతకు రైజ్ అవుతోంది. విదేశీ సంస్కృతి అయినా మనదిగా వోన్ చేసుకుని మరీ సెలబ్రేట్ చేస్తున్నారు. స్పూకీయెస్ట్ పండుగ గా చెప్పుకునే హాలోవీన్ చాలా ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఇది పశ్చిమ దేశాలలో ప్రధానంగా జరుపుకునే పండుగ అయినప్పటికీ భారతీయులు ఎంతగానో వోన్ చేసేసుకున్నారు.

హాలోవీన్ పండుగ అంటే రకరకాల వింతైన భయంకరమైన వస్త్రాలను ధరించాలి. జాంబీస్.. మంత్రగత్తెలు .. భూత ప్రేతాల్ని తలపించే డ్రెస్సింగ్ తప్పనిసరి. భయపెట్టేసే చిలిపి ఆటలను ఆడటం కూడా ఇందులో భాగం. ఈ పండుగ ఇంట్లో అత్యంత ప్రియమైనవారితో జరుపుకునేది.

తాజాగా బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ తన రంగురంగుల హాలోవీన్ సెలబ్రేషన్ దృశ్యాల్ని ఇన్ స్టాలో పంచుకుంది. సన్నీ లియోన్ – డేనియల్ వెబెర్ వారి ముగ్గురు గారాల పట్టీలైన నిషా కౌర్ వెబెర్… అషర్ సింగ్ వెబెర్ .. నోహ్ సింగ్ వెబెర్లతో సంపూర్ణ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. 1 నవంబర్ 2020 న సన్నీ ఇన్స స్టాలో హబ్బీ డేనియల్ వెబెర్ ..వారి పిల్లలు.. నిషా.. అషర్ .. నోహ్ లతో రంగురంగుల హాలోవీన్ చిత్రాలను పంచుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు అంతర్జాలాన్ని హీటెక్కిస్తున్నాయి. సన్నీ వింత గెటప్ లు .. డేనియల్ ఫన్ మైమరిపిస్తున్నాయి.

16 జూలై 2017 న నిషా కౌర్ వెబెర్ అనే 21 నెలల ఆడ శిశువును దత్తత తీసుకున్నప్పుడు సన్నీ లక్షలాది మంది హృదయాన్ని గెలుచుకుంది. ఏడాది తరువాత సన్నీ లియోన్ – ఆమె భర్త డేనియల్ వెబెర్ వారి కుటుంబానికి సంబంధించిన విషయాల్ని అధికారికంగా ప్రకటించారు సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చింది ఈ జంట. అషర్ సింగ్ వెబెర్ – నోహ్ సింగ్ వెబెర్ సర్రోగసీ ద్వారా జన్మించారు. అప్పటి నుండి వారి జీవితం స్వర్గంగా మారింది.