సన్నీ లియోన్ చేసిన ఫన్ తో వారి గుండె ఆగినంత పనైందట

0

సన్నీలియోన్ ప్రస్తుతం హిందీలో వరుసగా చిత్రాల్లో నటిస్తూ ఉంది. ఈమె గత కొన్ని రోజులుగా ‘కోకాకోలా’ అనే హర్రర్ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్రంకు సంబంధించిన షూటింగ్ ను ఉత్తర ప్రదేశ్లోని రావురాజ్ విలాస్ కుచేసర్ కోటలో జరిపారు. షూటింగ్ లో భాగంగా యూనిట్ సభ్యులందరితో చాలా సరదాగా అందరితో కలిసి పోయి మాట్లాడుతూ ఉంటుందట. ఒక రోజు షూటింగ్ లో భాగంగా నటుడు దేవ్ గిల్ తుపాకితో సన్నీలియోన్ ను కాల్చే సీన్ ను చేశారు.

ఆ సమయంలో దేవ్ గిల్ తుపాకితో కాల్చిన వెంటనే సన్నీలియోన్ కింద పడి పోయిందట. కట్ షాట్ ఓకే అంటూ చెప్పిన తర్వాత కూడా సన్నీలియోన్ లేవకుండా అలాగే పడిపోయి ఉందట. నిజమైన గన్ తో పేల్చినట్లుగా ఆమె కదలకుండా ఉండటంతో కొంపదీసి అది డమ్మీ గన్ కాకుండా నిజమైన గన్ అయ్యి ఉంటుందా అంటూ యూనిట్ సభ్యులు ఆందోళన చెందారట. కొన్ని నిమిషాల పాటు ఆమె ఉలుకు పలుకు లేకుండా ఉండటంతో యూనిట్ సభ్యులకు గుండె ఆగినంత పనైందట.

ఆమె హార్ట్ బీట్.. పల్స్ ను చెక్ చేయడం మొదలు పెట్టారు. ఆమెకు ఏమైనా గాయం అయ్యిందా అంటూ చూశారట. యూనిట్ సభ్యులంతా కంగార పడుతున్న సమయంలో నవ్వుకుంటూ సన్నీలియోన్ లేచిందట. సరదాగా యూనిట్ సభ్యులను ఆట పట్టించేందుకు ఇలా చేశానంటూ ఆమె చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారట.

ప్రసాద్ తాతినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సన్నీలియోన్ తో పాటు తెలుగు స్టార్ కమెడియన్స్ అయిన బ్రహ్మానందం మరియు సునీల్ లు కూడా నటించబోతున్నారు. ఇంకా పలువురు బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. హర్రర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంతో సన్నీలియోన్ లోని కొత్త యాంగిల్ ను చూస్తారంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
Please Read Disclaimer