సేఫ్ గా ఉండాలంటే ఇది తప్పదు : సన్నీలియోన్

0

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ట్విటర్ మరియు ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ప్రతి రోజు కనీసం రెండు మూడు పోస్ట్ లు అయినా పెడుతూ ఉంటుంది. ఆమె ఈమద్య కాలంలో ప్రజలను చైతన్య పర్చే విధంగా కూడా పోస్ట్ లు చేస్తూ ఉంది. తాజాగా సన్నీలియోన్ భర్త డేనియల్ తో కలిసి ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆ ఫొటోలో సన్నీలియోన్ మరియు ఆమె భర్త ఇద్దరు కూడా మాస్క్ ధరించి ఉన్నారు.

ముంబయి ఎయిర్ పోర్ట్ లో ఇలా వీరిద్దరు కూడా మాస్క్ ధరించి కనిపించి అందరిని ఆశ్చర్యపర్చారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న కారణంగా ఇలా మాస్క్ లు ధరించినట్లు గా సన్నీ లియోన్ చెప్పుకొచ్చింది. ప్రమాదం ఏ వైపు నుండి వస్తుందో తెలియదు. అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే కదా. కరోనా వైరస్ మిమ్ములను ప్రభావితం చేయకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అంటూ సన్నీలియోన్ పోస్ట్ చేసింది.

చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా వైరస్ తాలూకు లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒక దేశం నుండి మరో దేశంకు ఈ వైరస్ విమాన ప్రయాణికుల ద్వారానే వ్యాప్తి చెందుతుంది. అందుకే ముఖ్యంగా విమానాశ్రయాలకు వెళ్లిన సమయం లో విమానాల్లో ప్రయాణం చేసిన సమయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచింది. సన్నీలియోన్ చెప్పినట్లుగా ముందస్తు జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలి.
Please Read Disclaimer