మాస్క్ ధరించాలి పిల్లలు..! అంటున్న సన్నీలియోన్

0

దేశమంతా కరోనా బారినుండి ఎలా తప్పించుకోవాలని మాస్క్ ధరించి తిరుగుతున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ కూడా తన పిల్లల తో భర్తతో కలిసి మాస్క్ ధరించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కరోనా భయం తో సెలెబ్రిటీలు ఇళ్ల నుండి బయటికి రాలేకపోతున్నారు. గత కొన్ని రోజులుగా బయటికి రాని సన్నీలియోన్ తన స్వీట్ ఫ్యామిలీ తో ఈరోజు బయటికి వచ్చింది.

ఈ రోజుల్లో తప్పకుండా మాస్క్ లు ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ సన్నీ చెప్పుకొచ్చింది. నా పిల్లలకు కూడా మాస్కులు వేయడం బాధగా ఉందని కానీ మాస్క్ వేసుకోకపోతే నా పిల్లలు బాధపడాల్సి వస్తుందని.. వాళ్ళు బాధపడితే నేను నా భర్త తట్టుకోలేం అంటూ వాపోయింది. అందుకే మా పిల్లలకు మాస్క్ లు ధరించుకోవడం లో శిక్షణకు తీసుకెళ్తున్నట్లు తెలిపింది.

ఇదిలా ఉండగా సన్నీకి ముగ్గురు పిల్లలు. నిషా అని నాలుగేళ్ళ కూతురు ఉంది. నిషాను మహారాష్ట్రలోని లాతూరు లో దత్తత తీసుకుంది. ఇక ఇద్దరు మగ కవలపిల్లలు.. నోహ అశేర్. ఈ ఇద్దరు కవలపిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చింది. ప్రస్తుతం సన్నీ తన ముగ్గురు పిల్లల తో మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. కరోనా వైరస్ కారణంగా సెలెబ్రిటీలంతా సినిమా షూటింగులు మానుకొని ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లో కూడా ఖాళీగా ఉండలేక ఇలా ఫ్యామిలీ తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-