స్విమ్ సూట్ లో అగ్గి రాజేసిన హాటీ

0

సోషల్ మీడియాలో స్పీడ్ మీదున్న సన్నీలియోన్ నిరంతర ట్రీట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. అక్కడ స్టార్ స్టక్ ప్రచారంతో పాటు వ్యక్తిగత వ్యవహారాల్ని రివీల్ చేస్తుంటుంది. ప్రస్తుతం సన్నీ లాస్ ఏంజిల్స్లో తన కుటుంబంతో గడుపుతోంది. మహమ్మారీ భారి నుండి తన పిల్లలను సురక్షితంగా కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోందట. ముంబై లాక్ డౌన్ సమయంలోనే యుఎస్ వెళ్ళింది. అప్పటి నుండి రకరకాల సరదాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటోంది.తన కుమార్తె నిషాను గుర్రపు స్వారీ పాఠాల కోసం తీసుకెళ్లిన ఫోటోలు.. తన పిల్లలను పార్కుకు తీసుకెళ్లినప్పటి ఫోటోలు వీడియోల్ని సన్నీ సోషల్ మీడియాలో తన అభిమానులకు షేర్ చేసింది. తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తన స్నేహితురాలితో ఉన్న ఒక ఫోటోని పంచుకుంది. ఈ ఫోటోలో బ్లాక్ స్విమ్ సూట్ ధరించి హీట్ పుట్టించింది సన్నీ.స్విమ్ సూట్ ధరించి ఈతకు సిద్ధమైన సన్నీ యువతరంలో కల్లోలం రేపింది. లాస్ ఏంజెల్స్ లో ఓవైపు మహమ్మారీ విలయం కొనసాగుతున్నా.. ఈ అమ్మడు మాత్రం ఇలా అగ్గి రాజేసే పనిలో బిజీ అయ్యింది. తనతో పాటే స్నేహితురాలు కూడా బ్లాక్ బికినీలో ట్రీటిచ్చింది. ఇలా స్నేహితురాలితో ఫోజివ్వడమే కాదు.. ఈతకు వెళ్ళడం చాలా బాగుంది !! ప్రేమిస్తున్నాను! అంటూ వ్యాఖ్యను జోడించింది.

ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా సన్నీ తన భర్త డేనియల్ వెబెర్ కోసం ఓ వీడియోను పోస్ట్ చేసింది. ప్రపంచంలోని ‘ఉత్తమ పాపా’ అని ఆ ఫోటోకి ట్యాగ్ ను జత చేసింది. ఈ వీడియోలో ఈ జంటతో పాటు ముగ్గురు పిల్లలు నిషా- నోహ్ – ఆషర్ ఉన్నారు.
Please Read Disclaimer