ఈసారి యాహూలో నెం.1 స్థానం

0

పోర్న్ ఇండస్ట్రీలో రికార్డు స్థాయి పోర్న్ చిత్రాల్లో నటించి దర్శకత్వం వహించి సన్నీలియోన్ వాటిని పూర్తిగా వదిలేసింది. గత నాలుగు అయిదు సంవత్సరాలుగా సన్నీలియోన్ పూర్తిగా బాలీవుడ్ కే పరిమితం అయ్యింది. ఈమె బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఇండియాలో నెటిజన్స్ అందరి దృష్టి ఈమెపైనే ఉండేది. వరుసగా మూడు సంవత్సరాలు గూగుల్ సెర్చ్ లో నెం.1 గా నిలిచింది. బాలీవుడ్ స్టార్స్ తో పాటు ప్రముఖ పొలిటీషన్స్ కంటే కూడా ఎక్కువ మంది సన్నీలియోన్ ను గూగుల్ లో సెర్స్ చేశారు.

గత రెండు సంవత్సరాలుగా గూగుల్ సెర్చ్ లో ఈ అమ్మడు కాస్త వెనుకబడింది. గూగుల్ లో వెనుకపడ్డా యాహూలో మాత్రం ఈ అమ్మడి జోరు కొనసాగుతుంది. ఈ ఏడాదిలో యాహూ సెర్చ్ ఇంజన్ లో అత్యధికులు సెర్చ్ చేసిన పేరు సన్నీలియోన్ అంటూ యాహూ సంస్థ ప్రకటించింది. యాహూలో బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్.. దీపిక పదుకునే.. ఆలియా భట్ లను కూడా నెటిజన్స్ తెగ వెదికారు.

సన్నీలియోన్ కేవలం హిందీ సినిమాల్లోనే పరిమితం కాకుండా సౌత్ లో కూడా అవకాశం వచ్చిందంటే తప్పకుండా నటిస్తుంది. హీరోయిన్ పాత్రలకే గిరి గీసుకుని ఉండకుండా ఐటెం సాంగ్స్ నుండి అన్ని రకాల పాత్రలను కూడా చేస్తుంది. ఈమద్య కాలంలో సన్నీలియోన్ క్రేజ్ కాస్త తగ్గిందని భావిస్తుండగా యాహూలో ఆమె జోరు ప్రదర్శించి అందరిని ఆశ్చర్య పర్చింది. ప్రస్తుతం హిందీలో రెండు మూడు సినిమాలు చేస్తున్న ఈమె నటిగానే కాకుండా మానవత్వం చాటుకుంటూ మంచి మనిషిగా కూడా గుర్తింపు దక్కించుకుంటుంది. ఈమె పిల్లలను దత్తత తీసుకుని పెంచుతున్న విషయం తెల్సిందే.
Please Read Disclaimer