హాట్ సన్నీలియోన్ కి తీరని కోరిక ఇదేనట

0

మనసుకి నచ్చిన కార్ ని ఖరీదు చేయాలని.. ఎంత ఖరీదైనా దాన్ని సొంతం చేసుకోవాలని చాలా మందికి కోరిక వుంటుంది. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు సామాన్యుల దగ్గరి నుంచి మిలియనీర్ ల వరకు తమ కోరికకు తగ్గట్టు బ్రాండ్ న్యూ కార్ ని సొంతం చేసుకోవాలన్నది డ్రీమ్. హాట్ బేబీ సన్నీలియోన్ కి అలాంటి తీరని ఓ కోరిక వుందట. ఎంతో కాలంగా ఎదురుచూసిన ఆ కలని ఈ మధ్యే నిజం చేసుకుందీ మాజీ శృంగారతార కం ప్రస్తుత బాలీవుడ్ నాయిక.

మసెరటి లీవెంటే బ్రాండ్ లగ్జరీ కార్ అంటే సన్నీకి చాలా ఇష్టమట. దీని ఖరీదు అక్షరాలా కోటి 45 లక్షలు. ఈ లగ్జరీ కార్ ని సొంతం చేసుకోవాలని తన కోరికని తీర్చుకోవాలని చాలా రోజులుగా ఎదురుచూస్తోందట. ఆ కోరికని ఇన్నాళ్లకు తీర్చుకుంది సన్నీ. తన కలల కారు సొంతం కావడంతో మసెరటితో మెరిసిపోయింది. సంబరంలో మునిగితేలింది.

`నిన్ననే ఇంటికి తీసుకొచ్చాను. ఈ కారును నడిపిన ప్రతిసారీ నేను చాలా సంతోషంగా ఉన్నాను` అని ఇన్ స్టాలో మసెరటితో మెరిసిపోతున్న ఫొటోని షేర్ చేసింది సన్నీ. అన్నట్టు సన్నీలియోన్ తన దత్త పుత్రికలు భర్త సహా ఇటీవల అమెరికాలో అత్తారింట్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. అక్కడే అత్తమామలకు సేవలందిస్తోంది ఈ బ్యూటీ.