సూపర్ హీరో సిరీస్ తో సల్మాన్ భాయ్ ట్రీట్

0

బాలీవుడ్ లో సూపర్ హీరో అనగానే హృతిక్ రోషన్ పేరు గుర్తుకొస్తుంది. అతడు నటించిన క్రిష్ ఫ్రాంఛైజీ.. ధూమ్ 2 చిత్రాలు సంచలన విజయం సాధించడంతో అతడికి ఈ తరహా ప్రత్యేక ఇమేజ్ దక్కింది. బాలీవుడ్ లో ఇంకా క్రిష్ సిరీస్ ఎండ్ కాలేదు. ఈ ఫ్రాంఛైజీలో నాలుగో చిత్రం కోసం హృతిక్ – రాకేష్ రోషన్ బృందం ప్రయత్నాల్లో ఉంది. ఈలోగానే అదిరిపోయే వార్త.సూపర్ హీరో ఫ్రాంఛైజీ లీగ్ లోకి మరో బాలీవుడ్ హీరో రంగ ప్రవేశం చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ ఇన్నాళ్లు సూపర్ హీరో సినిమాలకు దూరంగా ఉన్నారు. దీంతో ఆ వెలితి అభిమానులకు ఎప్పటినుంచో అలానే ఉండిపోయింది. ఇప్పుడు ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా సల్మాన్ తీసుకున్న తాజా నిర్ణయం సంచలనం కానుందనే చెప్పాలి. ఇకపై సల్మాన్ ని సూపర్ హీరోగా చూడబోతున్నాం. అతడిని సూపర్ హీరోని చేసేందుకు అలీ అబ్బాస్ జాఫర్ సన్నాహకాల్లో ఉన్నారు.సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నాలుగు సూపర్ హీరో సినిమాల్ని వరుసగా తెరకెక్కించేందుకు అలీ అబ్బాస్ జాఫర్ ప్రయత్నిస్తున్నారు. దీనిపై చాలాకాలంగా గాలి వార్తలు వస్తున్నా ఇన్నాళ్టికి ఒక క్లారిటీ వచ్చింది. ఈ ఫ్రాంఛైజీలో నాలుగు సినిమాల కథలు వేటికవే యూనిక్ గా ఉంటాయి. ఒకదానితో ఒకటి లింకప్ అయిన కథాంశాల్ని జాఫర్ రెడీ చేస్తున్నారు. భారతీయ పురాణేతిహాసాల నుంచి ఒక సూపర్ హీరో రోల్ .. ఇండియన్ ఆర్మీ నుంచి ఒక సూపర్ హీరో రోల్ ని డిజైన్ చేస్తున్నారు.అలాగే కత్రిన కైఫ్ ని సూపర్ హీరో తరహా పాత్రలో చూపించేందుకు `మిస్టర్ ఇండియా` తరహా కాన్సెప్టును ఎన్నుకున్నట్టు అలీ అబ్బాస్ జాఫర్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇది అనీల్ కపూర్ మిస్టర్ ఇండియా స్ఫూర్తితో డిజైన్ చేసినదే అయినా దానికంటే భిన్నంగా ఉంటుందని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఈ మూవీ కూడా నాలుగు సినిమాల ఫ్రాంఛైజీలో ఒక భాగం అని వెల్లడించారు. ఇందులో సల్మాన్ ఖాన్ కూడా సూపర్ హీరోగా కనిపిస్తాడా లేదా అన్నది అతడు రివీల్ చేయలేదు. ఒక బ్యాడ్ ఈవిల్ ని ఎదురించే కామన్ ఉమెన్(కత్రిన) సూపర్ హీరోగా మారితే ఎలా ఉంటుంది అన్నది చూపిస్తారట.సల్మాన్ ఖాన్ – కత్రిన జంటతో అలీ అబ్బాస్ జాఫర్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాల్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఏక్ థా టైగర్ .. టైగర్ జిందా హై లాంటి బ్లాక్ బస్టర్లు ఈ కాంబోలో వచ్చాయి. ఆ క్రమంలోనే ఆ ఇద్దరినీ సూపర్ హీరోలుగా చూపించాలన్న ఆలోచనతో చాలా కాలంగా అలీ అబ్బాస్ జాఫర్ స్క్రిప్టుల్ని తయారు చేసే పనిలో ఉన్నాడు. “వీరంతా ఒకే విశ్వంలో భాగం అవుతారు. అది సూపర్ హీరో విశ్వం. ఫ్రాంచైజీ మొదటి చిత్రంలో కత్రినా కైఫ్ నటించనుంది“ అని జాఫర్ తెలిపారు. అయితే ఇందులో సల్మాన్ ఎంట్రీ ఎలా ఉంటుంది? అన్నదానిపై అతడు క్లారిటీనివ్వలేదు. నాలుగు సినిమాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడతాయి… ఒకదాని తరువాత ఒకటి విడుదల అవుతాయని అలీ అబ్బాస్ జాఫర్ వెల్లడించారు.

ఇక బాలీవుడ్ లో సూపర్ హీరో విశ్వం (యూనివర్శ్) ఇదే మొదటిది కాదని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. రోహిత్ శెట్టి ఇప్పటికే తన కాప్ సినిమాలతో ఒక యూనివర్శ్ ని సృష్టించే పనిలో ఉన్నారు. అతను దానిని `కాప్-యూనివర్స్` అని నామకరణం చేశాడు. క్రిష్ ఫ్రాంఛైజీ.. ధూమ్ ఫ్రాంఛైజీ ఈ తరహాలోనే యూనివర్శ్ గానే వస్తున్నాయి. అయితే ధూమ్ లో మాత్రం ఎంచుకుంటున్న కథాంశాలు.. పాత్రల్లో ఎంతో వైవిధ్యం కనిపిస్తోంది.
Please Read Disclaimer