స్టైలిష్ స్టారు కు సూపర్ హాట్ బాసు!

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ ఫిలిం ‘అల వైకుంఠపురము లో’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో షూటింగ్ కూడా చకచకా సాగుతోంది. ఈ సినిమా లో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా పూజ ఓ ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం వెల్లడించింది.

ఈ సినిమా లో పూజ.. బన్నీ ఒకే ఆఫీసులో పని చేస్తారట. తను బన్నీ కి బాస్ పాత్ర లో నటిస్తున్నానని తెలిపింది. స్ట్రిక్ట్ బాసుగా ఉన్నప్పటి కీ అప్పుడప్పుడూ సాఫ్ట్ గా ఉంటుందట. అంతే కాదు గోల్స్ విషయం లో చాలా టఫ్ గా ఉంటుందట. మరి ఇలాంటి అందమైన స్ట్రిక్ట్ బాసు తో మన స్టైలిష్ స్టార్ ఎలా వేగుతా డో వేచి చూడాలి. అయితే వర్క్ విషయం ఎలా ఉన్నా తమ మధ్య సంభాషణలు ఫన్నీగా ఉంటాయని.. ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకుల ను తప్పని సరిగా అలరిస్తాయని అంటోంది.

ప్రస్తుతం ‘అల వైకుంఠపురము లో’ టీమ్ యూరోప్ షెడ్యూల్ లో భాగంగా ప్యారిస్ లో ఉన్నారు. ఇప్పటి కే చార్ట్ బస్టర్ గా నిలిచిన సామజ వరగమన పాటను ప్యారిస్ లోని అందమైన లోకేషన్ల లో చిత్రీకరిస్తున్నారట. ఈ పాటతో పాటుగా కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా జరుపుతారని సమాచారం. ఈ సినిమా కు సంబంధించిన అప్డేట్స్ అన్నీ అంచనాలను పెంచేస్తున్నాయి. మరి ఈ అంచనాలను ‘అల వైకుంఠపురము లో’ అందుకుంటుందో లేదో చూడాలంటే సంక్రాంతి వరకూ వేచి చూడక తప్పదు.
Please Read Disclaimer