అధరచుంబనం అదరహో!

0

టాలీవుడ్ లో ఉన్న సీనియర్ మోస్ట్ బ్యూటీలలో శ్రియ ఒకరు. దాదాపుగా ఫేడ్ అవుట్ అయిపోయిందని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పటికీ శ్రియ చేతిలో సినిమాలు ఉన్నాయి. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళయినా చెక్కుచెదరని అందంతో అందరినీ ఆకర్షించడం చూసి ఈ జెనరేషన్ భామలు కూడా కుళ్ళుకోవాల్సిందే. శ్రియ పోయినేడాది మార్చిలో తన రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కోస్చీవ్ ను వివాహమాడి శ్రీమతిగా మారిపోయింది. అయితే తన భర్తను మీడియాకు కాస్త దూరంగానే ఉంచింది.

కొంతకాలంగా శ్రియ ప్రవర్తనలో మార్పు వచ్చింది. మెల్లగా తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేస్తూ ఆండ్రీని అందరికీ డిజిటల్ పరిచయం చేసింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ముంబైలో నిర్మాత రమేష్ తౌరాని దీపావళి పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి శ్రియ తన ముద్దుల భర్త ఆండ్రీతో కలిసి హాజరైంది. శ్రియ ట్రెడిషనల్ గా ఉండే ఛోళి.. లెహంగా లో హాజరయితే ఆండ్రీ ఫార్మల్ స్టైల్ లో ఇన్ షర్టు చేసుకొని కనిపించాడు. ఇక ఈ ఇండో రష్యన్ జంట మధ్యలో లవ్ కెమిస్ట్రీ ఓ రేంజ్ లో కనిపించిందని ముంబై మీడియా టాక్.

అంతే కాకుండా ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమ ఒలకబోసుకుంటూ లిఫ్టు దగ్గర ఒక ఆధరచుంబన దృశ్యాన్ని ఆవిష్కరించారు. ఫోటోగ్రాఫర్లు ఆ అద్భుతమైన సీన్ ను క్షణం ఆలస్యం చేయకుండా క్లిక్కుమనిపించారు. అదే మీరు పైన చూస్తున్న ఫోటో. టూ రొమాంటిక్ నో?
Please Read Disclaimer