మెగా అల్లుడి ‘సూపర్ మచ్చి’ అప్ డేట్

0

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకుని పులి వాసు దర్శకత్వంలో ‘సూపర్ మచ్చి’ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాణం అవుతున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ ముగింపు దశకు చేరుకుంది. తాజాగా ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి అయ్యిందని.. ఒకే పాట బ్యాలన్స్ ఉందంటూ నిర్మాతలు వాలెంటైన్స్ డే సందర్బంగా ప్రకటించారు.

ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ విభిన్నమైన రోల్ లో కనిపించబోతున్నాడని.. ఈతరం యూత్ ను రిప్రజెంట్ చేసే పాత్రను కళ్యాణ్ దేవ్ పోషించాడంటూ నిర్మాతలు చెబుతున్నారు. సినిమాకు థమన్ ఇచ్చిన పాటలు హైలైట్ గా నిుస్తాయన్నారు. ఇప్పటికే మూడు పాటల చిత్రీకరణ చేశాం. అవి చాలా బాగా వచ్చాయి. మరో రెండు పాటలను వచ్చే నెలలో గోవాలో చిత్రీకరించబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.

సూపర్ మచ్చిలో కళ్యాణ్ దేవ్ కు జోడీగా కన్నడ ముద్దుగుమ్మ రచితా రామ్ నటించింది. ఈ అమ్మడి లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వీరిద్దరి మద్య కెమిస్ట్రీ బాగా కుదిరిందంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మార్చిలో షూటింగ్ మరియు నిర్మాణానంతర క్యాక్రమాలు పూర్తి చేసి సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు గా నిర్మాతలు ప్రకటించారు. రెండవ సినిమా తో తప్పకుండా విజయం సాధిస్తాననే నమ్మకం తో కళ్యాణ్ దేవ్ ఉన్నాడు. మరి ఆయన నమ్మకం ఏమేరకు నిజం అయ్యేనో చూడాలి.
Please Read Disclaimer