మెగా-రెబెల్-సూపర్ స్టార్లు!

0

ఒకే ఫ్రేమ్ లో టాప్ హీరోలను చూడడం అభిమానులకు ఎప్పుడూ సంతోషమే. అదే ఫ్లాష్ బ్యాక్ ఫోటో అయితే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది. ఈ ఫోటో అలాంటిదే. దర్శకుడు జయంత్ సి. పరాన్జీతో కలిసి మెగాస్టార్ చిరంజీవి.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. శ్రీకాంత్.. తరుణ్.. సుమంత్.. ఇలా ఒకే ఫ్రేం లో చాలామంది హీరోలున్నారు. వెనుక రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ కూడా ఉన్నాడు.

అందరూ చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకు పోజిచ్చారు. కరెక్టుగా ఈ ఫోటో ఎప్పటిదనేది తెలియదు కానీ చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వక మునుపు ‘శంకర్ దాదా MBBS’ షూటింగ్ నాటి ఫోటో అనిపిస్తోంది. ఎందుకంటే ఆ సినిమాలో చిరుతో పాటు శ్రీకాంత్ కూడా నటించారు. ఇక దేవీ శ్రీ ప్రసాద్ ఆ సినిమాకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించారు. ఆ సినిమా లాంచ్ సమయంలో తీసిన ఫోటో అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఆ నవ్వులు చూస్తుంటే మెగా స్టార్ “ఇన్ ఫ్రంట్ క్రోకోడైల్స్ ఫెస్టివల్” అని డైలాగ్ వేసి ఊరుకుంటే మిగతా వారందరూ నవ్వుల్లో మునిగి పోయినట్టు అనిపిస్తోంది కదా?

ఒక్క సుమంత్ తో తప్ప దర్శకుడు జయంత్ ఈ ఫ్రేమ్ లో ఉన్న హీరోలు అందరితో సినిమాలు చేశారు. మహేష్ తో ‘టక్కరి దొంగ’.. ప్రభాస్ డెబ్యూ ఫిలిం ‘ఈశ్వర్’.. తరుణ్ తో ‘సఖియా’ సినిమాలు తెరకెక్కించారు. ఇక చిరుతో ‘బావగారు బాగున్నారా’.. ‘శంకర్ దాదా MBBS’ చిత్రాలు తెరకెక్కించారు.
Please Read Disclaimer