భూమ్మీద సూపర్ స్టార్ మెచ్చే ఎగ్జోటిక్ ప్లేస్

0

కుదిరితే దుబాయ్.. కుదరకపోతే లండన్.. మరీ తీరిక చిక్కితే ప్యారిస్.. ఏదో ఒక చోటికి వెళ్లి సెలబ్రేషన్స్ లో మునిగిపోవడం సూపర్ స్టార్ మహేష్ కి అలవాటు వ్యాపకం. కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లి అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేసి బుర్రలోంచి బర్డెన్ దించేసి వస్తుంటారు. మరి ఈ దసరా సెలవులకు ఎక్కడికి వెళ్లి ఉంటారు? అంటే… ఈసారి మాత్రం తన ఫేవరెట్ డెస్టినేషన్ కి వెళ్లారు. ఫేవరెట్ అంటే అలాంటిలాంటి ప్లేస్ కాదు అది.. భూతల స్వర్గం.. ఈ భూమ్మీద తనను అత్యంత గొప్పగా ఆకట్టుకునే చోటికి కుటుంబ సమేతంగా వెళ్లారు మహేష్.

తనతో పాటే సతీమణి నమ్రత శిరోద్కర్ .. కిడ్స్ మాస్టర్ గౌతమ్- చిట్టి సితార కూడా ఉన్నారు. ఒక అందమైన కుటుంబం అక్కడ వాలిపోయి ఆ విజువల్ గ్రాండియర్ ప్రక్రతి సౌధానికే వన్నె తెచ్చింది అంటే అతిశయోక్తి కాదు. ఆ ఫేవరెట్ ప్లేస్ ఏది? అంటే స్విస్ ఆల్ప్స్. స్విట్జర్లాండ్ లో అందమైన పూదోటల మధ్య పర్వత శ్రేణుల నడుమ ఉండే ఈ విలాసవంతమైన చోటులో మహేష్ ఫ్యామిలీ అల్పాహారానికి రెడీ అయ్యింది. ఆ ఫోటోలని మహేష్ స్వయంగా షేర్ చేశారు.

ఈ ట్రిప్ ముగిశాక.. మళ్లీ `సరిలేరు నీకెవ్వరు` పెండింగ్ చిత్రీకరణలో పాల్గొంటారు. ఓవైపు అనీల్ రావిపూడి రెట్టించిన ఆఫర్లతో రెట్టించిన ఉత్సాహంతో ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. 2020 సంక్రాంతి లక్ష్యంగా సినిమాని రిలీజ్ చేయాలన్న కసితో ప్రణాళికా బద్ధంగా పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer