ఆ ఫోన్ కాల్ తో సూపర్ స్టార్ కు హై సెక్యూరిటీ

0

తమిళ స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లుగా ఒక వ్యక్తి తమిళనాడు పోలీసు హెడ్ క్వార్టర్స్ కు కాల్ చేసి మరీ చెప్పిన విషయం తెల్సిందే. ఫోన్ కాల్ అందుకున్న వెంటనే పోలీసులు పెద్ద ఎత్తున విజయ్ ఇంట్లో తనికీలు చేశారు. దాదాపు అర్దగంట పాటు బాంబు స్వాడ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. చివరకు ఇంట్లో ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు. ఆ తర్వాత విజయ్ తండ్రి ఇంట్లో ఏమైనా బాంబు పెట్టి ఉంటారా అనే అనుమానంతో కూడా అక్కడ సోదాలు నిర్వహించారు. అక్కడ కూడా ఎలాంటి బాంబు లభ్యం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

బాంబు పెట్టినట్లుగా ఫోన్ చేసిన వ్యక్తిని కొన్ని గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. అతడిని ప్రశ్నించగా రకరకాలుగా సమాధానాలు చెప్పాడట. దాంతో పోలీసులు అనుమానంతో లోతుగా ఎంక్వౌరీ చేస్తున్నారు. ఈ సమయంలోనే విజయ్ ఇంటికి హై సెక్యూరిటీని పెట్టినట్లుగా పోలీసు వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం విజయ్ ఇంటికి ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు పోలీసు సెక్యూరిటీ కూడా భారీగా ఉందని తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

విజయ్ మరియు ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడకు వెళ్లినా కూడా పోలీసులు సెక్యూరిటీ ఇస్తున్నారట. విజయ్ ఈమద్య కాలంలో చేస్తున్న సినిమాలు కొందరికి వ్యతిరేకంగా ఉంటున్నాయని.. అందుకే వారు విజయ్ పై కక్ష పెంచుకుని ఏమైనా చేస్తారేమో అంటూ అనుమానాలు ఉన్నాయి. అందుకే విజయ్ కి సెక్యూరిటీ పెంచినట్లుగా సమాచారం అందుతోంది.

ఇక విజయ్ దీపావళి కానుకగా ‘బిగిల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అట్లీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంకు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం విజయ్ గత చిత్రాలను మించి వసూళ్లు దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
Please Read Disclaimer