సూపర్ స్టార్ గర్ల్ ఫ్రెండ్ సో బ్యూటిఫుల్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోందనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటివరకూ రష్మిక బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది కానీ మహేష్ లాంటి పెద్ద స్టార్ తో నటించలేదు.. ఇదే మొదటిసారి. దీంతో ఈ సినిమా విజయంపై చాలా నమ్మకమే పెట్టుకుంది. ఈ సినిమా నుండి ఇప్పటివరకూ మహేష్.. విజయశాంతికి సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు కానీ రష్మిక పోస్టర్ లు రిలీజ్ చేయలేదు. దీంతో రష్మిక లుక్ ఈ సినిమాలో ఎలా ఉంటుందనేది తెలియదు.

తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ లొకేషన్ నుండి కొన్ని స్టిల్స్ బయటకు వచ్చాయి. ఈ ఫోటోలలో ఓ అందమైన హాఫ్ శారీలో నడుచుకుంటూ వెళ్తోంది. ఒక ఫోటోలో ఫోన్ చూసుకుంటూ.. మరో ఫోటోలో తన తన లంగాఓణీ డ్రెస్ కింద మట్టికి తగిలి మురికి కాకుండా అలా పైకి పట్టుకుని వయ్యారంగా కనిపించింది. షూటింగ్ లొకేషన్ కావడంతో అసిస్టెంట్ ఒకరు ఈ యువరాణికి ఎండ తగలకుండా గొడుగుపట్టినట్టుగా గొడుగు పట్టుకున్నాడు. ఆరెంజ్ షేడ్ – క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఉన్న లంగా ఓణీ ధరించిన రష్మికను చూస్తుంటే నిజమైన యువరాణి లాగానే ఉంది. అసలే సూపర్ హ్యాండ్సమ్ అయిన మహేష్ కు సరైన జోడీలా ఉంటుందని అనిపిస్తోంది.

ఆన్ లొకేషన్ స్టిల్స్ లోనే రష్మిక ఇలా అందరినీ మాయలో పడేస్తుంటే.. సరిలేరు టీమ్ రిలీజ్ చేసే పోస్టర్లలో ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఈ సినిమా కనుక హిట్ అయితే రష్మికకు ఫ్యూచర్లో మరి కొన్ని స్టార్ హీరో సినిమా అవకాశాలు లభిస్తాయనే అంచనాలు ఉన్నాయి.
Please Read Disclaimer