మంచి మనసుతో సూపర్ స్టార్ భారీ విరాళం

0

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెల్సిందే. లాక్ డౌన్ కు ముందే సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు అంతా కూడా షూటింగ్స్ ను రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించారు. షూటింగ్స్ నిలిచి పోవడం తో ఎంతో మంది సినీ కార్మికులు రోడ్డున్న పడ్డట్లయ్యింది. రోజువారి కూలీతో జీవితంను గడిపే ఎంతో మందికి ఇప్పుడు తీవ్రమైన కష్టాలు ఎదురవుతున్నాయి. ఆ భాష ఈ భాష అనే కాకుండా దాదాపు అన్ని భాషల సినిమా పరిశ్రమలు ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

రోజు వారి సినీ కార్మికుల కోసం పలువురు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే తమిళ స్టార్స్ సూర్య ఇంకా కార్తీలు తమ వంతు సాయం అన్నట్లుగా 10 లక్షల సాయంను ప్రకటించారు. ఇక తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ వర్కర్స్ కోసం 50 లక్షల విరాళం ఇస్తున్నట్లుగా ప్రకటించాడు. ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా కు రజినీకాంత్ 50 లక్షల విరాళంను ఇచ్చాడు.

సినీ షూటింగ్స్ లేక పోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ విరాళంను అందించాలంటూ రజినీకాంత్ విజ్ఞప్తి చేశాడు. కొన్ని వందలు వేల మంది షూటింగ్స్ లేకపోవడం వల్ల పూట గడవక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారందరికి కాకున్నా కూడా రజినీకాంత్ సాయం కొందరికి అందినా మంచిదే కదా అంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో చేసిన పనిని వారు ప్రశంసల తో నెత్తికి ఎత్తుకుంటున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-