భాగమతి కొత్త అడ్డాలో సూపర్ స్టార్

0

అనుష్క హీరోయిన్ గా యూవీ క్రియేషన్స్ లో అశోక్ దర్శకత్వంలో రూపొందిన ‘భాగమతి’ చిత్రం ప్రస్తుతం హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెల్సిందే. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందబోతున్న భాగమతి రీమేక్ కు ఇప్పటికే దుర్గవతి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ రీమేక్ లో అనుష్క పాత్రను భూమి పడ్నేకర్ పోషిస్తుంది. రీమేక్ కు కూడా అశోక్ దర్శకత్వం వహిస్తుండగా వయోకామ్ 18.. టిప్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడు.

ప్రస్తుతం బోపాల్ లో ఈ చిత్రంకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతుంది. అక్కడ ఒక పాత భవంతిలో ఈ చిత్రంను చిత్రీకరిస్తున్నారు. హిందీ నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేర్పులు చేయడంతో పాటు సినిమాలో ముఖ్య పాత్రకు గాను అక్షయ్ కుమార్ ను నటింపజేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఈమద్య కాలంలో అక్షయ్ కుమార్ సినిమా అంటే హాట్ కేక్ మాదిరిగా అయ్యింది. ఆయన ఏ సినిమా చేసినా అది ఎలా ఉన్నా కూడా వందల కోట్లు వసూళ్లు నమోదు అవుతూనే ఉన్నాయి. అందుకే ఈ చిత్రం కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. గెస్ట్ రోల్ అయినా కూడా అక్షయ్ కుమార్ మూవీ అంటూ దుర్గవతికి క్రేజ్ వస్తుందని.. తద్వారా భారీగా వసూళ్లు నమోదు అవుతాయని నిర్మాతలు ఆశ పడుతున్నారు.
Please Read Disclaimer