సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

ఇప్పుడు కృష్ణగారితో బైట్ ఎందుకో?

0

విజయ నిర్మల బతికి ఉన్న రోజుల్లో కృష్ణ విజయ నిర్మల ఇద్దరు కలిసి మహేష్ బాబు నటించిన సినిమాలతో పాటు కుటుంబంకు చెందిన సభ్యుల సినిమాలను చూసి వాటిపై స్పందించే వారు. కాని విజయ నిర్మల మృతి తర్వాత కృష్ణ మీడియాలో కనిపించడం లేదు. చాలా అరుదుగా మాత్రమే ఆయన సోషల్ మీడియాలో అయినా ఎలక్ట్రానిక్ మీడియాలో అయినా కనిపిస్తున్నారు. తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రం కోసం ఆయన బైట్ ఇచ్చారు.

సినిమా విడుదల మూడు వారాలు కావస్తుంది. ఇప్పటికే సినిమా చాలా ఏరియాల్లో కలెక్షన్స్ క్లోజ్ అయ్యాయి. అతి తక్కువ థియేటర్లలో మాత్రమే సినిమా ఆడుతుంది. మరో వారం రోజుల్లో ఆ థియేటర్ల నుండి కూడా సినిమాను తొలగించే అవకాశం ఉంది. సినిమా భారీ వసూళ్లను సాధించినా కూడా అల వైకుంఠపురంలో ముందు నిలువలేక పోయిందనేది సోషల్ మీడియా టాక్. ఈ సమయంలో కృష్ణ తో వీడియో బైట్ ఇప్పించి ఇంకా సరిలేరు నీకెవ్వరు చిత్రానికి ప్రేక్షకులను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు చిత్రం గురించి కృష్ణ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ కా బాప్ అంటూ ప్రచారం చేయడం బాగుంది. ఈ సినిమా ఇంకా చాలా రోజులు ఆడుతుంది. ఇంకా కలెక్షన్స్ వస్తాయన్నారు. అలాగే ఈ చిత్రంను నిర్మాత ఎక్కడ రాజీ పడకుండా రిచ్ గా నిర్మించాడు అలాగే దర్శకుడు సినిమా బోర్ అనిపించకుండా తెరకెక్కించారు అంటూ అభినందించారు. కృష్ణ వీడియో బైట్ కు స్పందించిన మహేష్ బాబు ట్విట్టర్ లో థ్యాంక్యూ మై సూపర్ స్టార్ సరిలేరు నీకెవ్వరు అంటూ ట్వీట్ చేశారు.

సినిమా రన్ పూర్తి కాబోతున్న ఈ సమయంలో కృష్ణ గారి బైట్ తో పబ్లిసిటీ ఏంటో అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా గురించి కృష్ణ స్పందించడం చాలా సంతోషంగా ఉందంటున్నారు.
Please Read Disclaimer