ఇప్పటి నుండే కటౌట్లు ఏంటీ గురూ

0

సూపర్ స్టార్ మహేష్ బాబు 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల కు సిద్దం అవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. మహేష్ బాబు కెరీర్ లో ఇది మరో బ్లాక్ బస్టర్ రికార్డుగా నిలవడంతో పాటు నాన్ బాహుబలి రికార్డును సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా అంచనాలు పెంచేసుకుంటున్నారు. సినిమా విడుదల దగ్గర పడుతున్న సమయంలో యూనిట్ సభ్యులు కాస్త సైలెంట్ గా ఉంటున్నా కూడా ఫ్యాన్స్ మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

సరిలేరు నీకెవ్వరు చిత్రం టీజర్ ను తెగ ట్రెండ్ చేసిన మహేష్ బాబు ఫ్యాన్స్ అప్పుడే సినిమాకు సంబంధించిన కటౌట్ ను పెట్టేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ 35ఎంఎంలో మహేష్ బాబు కటౌట్ ను పెట్టారు. దాదాపు 85 అడుగుల భారీ కటౌట్ ను అప్పుడే ఏర్పాటు చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. సినిమా విడుదలకు ఇంకా నెలన్నర రోజులకు ఎక్కువ గానే గడువు ఉంది. అయినా అప్పుడే ఫ్యాన్స్ కటౌట్ ఏర్పాటు చేయడం ఇండస్ట్రీలో చర్చకు తెర లేపింది.

సినిమా విడుదల సమయంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేయడం చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. కాని ఇంకా చాలా రోజులు ఉండగా ఇలా కటౌట్స్ ఏర్పాటు చేయడం మహేష్ బాబు ఫ్యాన్స్ కే ఆ క్రెడిట్ దక్కింది అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మహేష్ బాబు ఈ చిత్రం లో విభిన్నమైన పాత్ర లో కనిపించబోతున్నాడు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా దర్శకుడు అనీల్ రావిపూడి ఈ చిత్రంను మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడట. మహేష్ బాబు కు జోడీగా రష్మిక హీరోయిన్ గా నటించగా కీలక పాత్ర లో విజయశాంతి నటించడంతో సినిమా క్రేజ్ మరింత గా పెరిగింది.

నిర్మాత బండ్ల గణేష్ కూడా ఈ చిత్రం లో కీలక పాత్రను పోషిస్తున్నాడు. అందుకే సినిమా ఖచ్చితంగా ఓ రేంజ్ లో ఉంటుందని అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు. సంక్రాంతికి అల వైకుంఠపురం లో చిత్రం కూడా విడుదల కాబోతుంది. రెండు హోరా హోరీగా తలపడబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ సందడి సోషల్ మీడియాలో చాలా ఎక్కువ గా కనిపిస్తోంది.
Please Read Disclaimer