ఆ కంప్లైంట్‌ నాపై ఉంది కాని.. నేను కథ నచ్చితేనే చేస్తా: మహేష్ బాబు

0

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్‌లో మహేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘ఇది మిరకిల్ డే.. ఎందుకంటే ఈరోజు అనీల్ రావిపూడికి కొడుకు పుట్టాడు. అలాగే దిల్ రాజు గారు గ్రాండ్ ఫాదర్ అయ్యారు. ఇన్ని మంచి విషయాలు ఒకేరోజు జరగడం ఆనందంగా ఉంది. ఇక మేం అడగగానే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన చిరంజీవిగారి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన గురించి చెప్పాలంటే.. నేను నటించిన ఒక్కడు సినిమా చూసి నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడిన విషయాలు నాకు ప్రేరణగా నిలిచాయి.

ఇక అర్జున్ సినిమా అప్పుడు సెట్‌కి వచ్చి నీలాంటి వాడు ఇండస్ట్రీలో ఉండాలని ఆయన చెప్పిన మాటలు.. పోకిరి సినిమా చూసి నిన్ను కలవాలి రా అని పిలిచారు.. ఆ సినిమాలో నా పెర్ఫామెన్స్ గురించి రెండు గంటలు పైగా మాట్లాడారు. మీ మాటలు, మీరు మాకెప్పుడూ ఆదర్శంగానే ఉంటారు.

అలాగే భరత్ అనే నేను, మహర్షి సినిమాలప్పుడు ఫస్ట్ కాల్ ఆయన దగ్గర నుండే వచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి కూడా చిరంజీవి గారి దగ్గర నుండి ఫస్ట్ కాల్ రావాలని కోరుకుంటున్నా.

విజయశాంతి గారు నన్ను బాగా ఎక్కువ పొగిడేశారు. ఆవిడతో నేను కొడుకు దిద్దిన కాపురం సినిమా చేశా. అప్పుడు సెట్‌లో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఏ మాత్రం తేడాలేదు. షాట్ ఉన్నా లేకున్నా ఆమె సెట్‌లో ఉంటారు. ఈ జనరేషన్ ఇలాంటి నటులు ఆదర్శం. ఆమెకు మేం ఆఫర్ ఇవ్వడం కాదు.. మీరే మాకు ఆఫర్ ఇచ్చారు. మా సినిమాలో నటించి. థాంక్యూ మేడమ్.

నేను చాలా మంది దర్శకులతో పనిచేశా కాని.. ఫస్ట్ టైం ఒక డైరెక్టర్‌లో ఇంత పాజిటివ్‌ని ఇప్పటి వరకూ చూడలేదు. ప్రతిరోజు ఆయనతో పనిచేయడాన్ని ఎంజాయ్ చేశా. ఈ సినిమా జూలై 4 స్టార్ట్ చేస్తే.. డిసెంబర్ 18 అయిపోయింది. ఇంత ఫాస్ట్‌గా నేను ఎప్పుడూ చేయలేదు. ఈ సినిమా చాలా ఆనందంగా హాయిగా చేశా.

నేను మాస్ సినిమా చేసి చాలా రోజులైందని మా ఫ్యాన్స్ అందరూ కంప్లైంట్ చేస్తారు. నేనెప్పుడూ కథ నచ్చితేనే చేస్తా.. ఇప్పుడు అనీల్ కథ నాకు నచ్చింది అందుకే చేశా. అది మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు నా కెరియర్‌లోనే బెస్ట్‌గా ఉంటాయి. అలాగే కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌తో తొలిసారి పనిచేశా. ఆయన రెండు పాటలు చాలా బాగా వచ్చాయి. తమన్నా స్పెషల్ సాంగ్‌లో అదరగొట్టింది. రష్మిక చాలా స్వీట్‌గా పని చేసింది.

ఏ జన్మలో పుణ్యం చేసుకుంటేనో ఇలాంటి అభిమానులు మాకు దొరికారు. జనవరి 11న మీకు ఒక కానుక ఇవ్వబోతున్నాం. ఇది మా దర్శకుడు అనీల్ వల్ల సాధ్యం అయ్యింది. నేను మీ లాగే వెయిట్ చేస్తున్నా రిజల్ట్ కోసం.. మా ‘సరిలేరు నీకెవ్వరు’ టీం ఎల్లప్పుడూ చిరంజీవిగారితో ఉంటుంది’ అంటూ మెగా సూపర్ ఈవెంట్‌లో అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు మహేష్ బాబు.
Please Read Disclaimer