మహేష్ లుంగీ డ్యాన్స్ కిర్రాకులే

0

సూపర్ స్టార్ మహేష్ లుంగీ కడితే ఆ లుంగీకే గ్లామరొచ్చేస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇదివరకూ దూకుడుతో ప్రూవైంది కూడా. నీ స్టైలే ధడక్ అంటూ సాగే పాటలో రైతులతో కలిసి లుంగీ కట్టి ఛమక్కులా చిందులేసాడు. ఆ లుంగీ స్టెప్ లో ఓ సిగ్నేచర్ ఉంది. మెడలో కర్చీప్… పూల చొక్కా.. గళ్ల లుంగీ తో మాస్ స్పెప్పులతో అభిమాల్ని అలరించాడు. తర్వాత అదే సెంటిమెంట్ ను శ్రీమంతుడు లో రిపిట్ చేసాడు. అయితే పల్లెటూరి వాతావరణం నేపథ్యం లో వచ్చే సీన్ లో లుంగీ ధరించి ఊరిని అలా ఓ రౌండ్ వేసేస్తాడు. ఆ తర్వాత భరత్ అనే నేను లోనూ వచ్చాడయ్యో సామి సాంగ్ లోనూ తెల్ల పంచెకట్టు తో సిగ్నేచర్ స్టెప్ తో అలరించాడు.

ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల షేర్ ను సాధించాయి. మరి ఇప్పుడు ఆ సెంటిమెంటు తోనే ఇలా లుంగీ స్టెప్ ప్లాన్ చేశారా? లేక సబ్జెక్ట్ డిమాండ్ చేసిందా? ఏదేమైనా.. మరోసారి సూపర్ స్టార్ లుంగీ డాన్స్ తో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. సరిలేరు నీకెవ్వరు లో ఓ లుంగీ స్టెప్ ఉన్నట్లు యూనిట్ రివీల్ చేసింది. దూకుడు తరహాలో మళ్లీ గళ్ల లుంగీ…పూల చొక్కా…మెడలో కర్చీప్ … కళ్లకు అద్దాలతో ఊర మాస్ స్టయిల్ లో అలరిస్తోన్న పోస్టర్ ని తాజాగా రిలీజ్ చేసారు. మహేష్ మాస్ ఇమేజ్ ని ఎలివేట్ చేస్తూ కొరియోగ్రఫీ చేసినట్లు తెలుస్తోంది.

అలాంటి కాస్ట్యూమ్ లో మహేష్ కెమెరా ముందుకొస్తే చాలు అన్నంత అందాన్ని పోస్టర్ లో తీసుకొచ్చారు. దూకుడు లో నీ స్టైలే సాంగ్ ని రిపీట్ చేసినట్లే కనిపిస్తోంది. అభిమానులకు ఇది పెద్ద ట్విస్టే. ఇప్పటికే దూకుడు- ఎఫ్-2 వంటి చిత్రాల కామెడీని మించేలా ట్రీట్ ఉంటుందని ప్రచారం వేడెక్కించేస్తున్నారు. నిన్నటి ప్రచారంలో మహేష్ సైతం థియేటర్లు దద్దరిల్లి పోతాయనడంతో మరింత హైప్ వచ్చింది. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer