మురుగదాస్ తో సూపర్ స్టార్ డీల్ వెనక

0

తమిళ డైరెక్టర్ ఏ.ఆర్ మురగదాస్ రేంజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకూ బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలన విజయాలు నమోదు చేసారు. ముఖ్యంగా కెరీర్ ఆరంభంలో రమణ (ఠాగూర్)- గజిని చిత్రాలు ఆయనకు దర్శకుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి. దక్షిణాది సహా ఉత్తరాది హీరోలు మురగదాస్ తో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారంటే అతడి ట్రాక్ రికార్డ్ అందుకు కారణం. బాలీవుడ్ లోనూ ఆయన అగ్ర హీరో కిలాడీకి బ్లాక్ బస్టర్ ఇచ్చి ప్రతిభని చాటారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో దర్బార్ చిత్రాన్ని ప్రతి ష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేదికపై ఎన్నో ఆసక్తికర సంగతులు రివీలయ్యాయి. ముఖ్యంగా మురుగదాస్ తో కాంబినేషన్ ఎలా కుదిరిందో సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా వెల్లడించారు. రజనీ మాట్లాడుతూ.. 2.0 ఓ సమయంలోనే నిర్మాతత సుభాస్కరన్ తన బ్యానర్లో సినిమా చేయమని అడిగారు. అందుకు వెంటనే ఒకే చెప్పా. కానీ దర్శకుడు ఎవరు? అని ఆలోచించినప్పుడు మురగదాస్ అయితే బాగుంటుందనిపించింది. రమణ- గజినీ చిత్రాలు చూసినప్పటి నుంచి ఆయనతో పనిచేయాలనుకుంటున్నా. కానీ కుదరలేదు. కాలా సినిమా టైమ్ లో ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కథతో చేస్తానని వచ్చారు. అయితే పేట చిత్రంలో నన్ను చూసిన మురగదాస్ మీరు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తానని తెలిసి ఉంటే అద్భుతమైన సినిమా చేసే వాడిని కదా అని వారం తర్వాత దర్బార్ కథతో వచ్చాడు. ఆ కథ నాకు బాగా నచ్చింది. అందుకే వెంటనే సినిమా ప్రారంభించామని సూపర్ స్టార్ తెలిపారు.

మొత్తానికి రజనీ ఈసారి కూడా తన పాత ప్యాట్రన్ లో పూర్తి మాస్ కమర్షియల్ హీరోగా కనిపిస్తున్నారని ఆయన మాటల్ని బట్టి అర్థమవుతోంది. అయితే పేట చిత్రానికి తమిళనాట దక్కినంత ఆదరణ తెలుగులో దక్కలేదు. రజనీ సినిమాలకు తెలుగు నాట డిమాండ్ తగ్గింది. ఇలాంటి సన్నివేశంలో `దర్బార్` కి ఇక్కడ ఎలాంటి ఆదరణ దక్కనుంది అన్నది చూడాలి. మహేష్ తో స్పైడర్ లాంటి బిగ్ ఫ్లాప్ మురుగదాస్ కి తెలుగు మార్కెట్లో మైనస్ అవ్వడం తెలుగు మార్కెట్లో ఇబ్బందికరం. అయితే దర్బార్ పై ఆ ప్రభావం ఎంత? అన్నది మార్కెట్ వర్గాలే విశ్లేషించాల్సి ఉంటుంది.
Please Read Disclaimer