మాస్ మూవీ పై మహేశ్ మోజు బయటకు వచ్చిందిగా?

0

అగ్ర నటుడు మహేశ్ బాబుతో సినిమా ఓకే అనిపించుకోవటం మామూలు విషయం కాదు. కథ..కథనంతో పాటు ఏ జోనర్ మీద మనసు పడ్డారో తెలుసుకోవటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు మహేశ్ తో సినిమా చేయాలని తపించే వారికి చక్కటి అవకాశంగా చెప్పక తప్పదు. తాజాగా నిర్వహించిన సరిలేరు నీకెవ్వరూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా మహేశ్ చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు.. త్వరలో ఆయన నుంచి ఫుల్ మాస్ సినిమా రావటం ఖాయమని చెప్పక తప్పదు.

ఎందుకంటే.. తానో మాస్ సినిమా చేసి చాలా రోజులైందన్న మాట మహేశ్ చెప్పటం చూస్తే..తానిప్పుడు మాస్ మూవీ కోసం సీరియస్ గా చూస్తున్న విషయాన్ని చెప్పేసినట్లుగా చెప్పాలి. మహేశ్ మాటల్ని అందిపుచ్చుకొని కథను రెఢీ చేసి.. ఆయన చేత ఓకే చెప్పించుకునే లక్కీ ఛాన్స్ ఏ నిర్మాత కొట్టేస్తారో చూడాలి.

అంతేకాదు.. ఎప్పుడూ లేని రీతిలో మహేశ్ నోటి నుంచి సినిమాను త్వరగా పూర్తి చేయాలన్న మాట కూడా వచ్చింది. ఇటీవల కాలంలో ఆయన సినిమాలు చాలా ఆలస్యమవుతున్నాయి. అందుకు భిన్నంగా తాజా చిత్రాన్ని చాలా తక్కువ సమయంలో పూర్తి చేశారు.

ఇదే విషయాన్ని మహేశ్ ప్రస్తావిస్తూ.. తానెప్పుడూ ఇంత త్వరగా సినిమాను పూర్తి చేయలేదని చెప్పటం చూస్తే.. రానున్న రోజుల్లో మరింత వేగంగా సినిమాను పూర్తి చేయాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారని చెప్పక తప్పదు. తక్కువ వ్యవధిలో సినిమా పూర్తి అయ్యేలా పక్కా ప్లానింగ్ తో పాటు మాస్ కథాంశంతో మహేశ్ వద్దకు వెళితే.. ఆయన నోటి నుంచి ఓకే మాటకు ఛాన్స్ ఉందని చెప్పక తప్పదు. మరా.. లక్కీ ఛాన్స్ ఎవరు సొంతం చేసుకుంటారో?
Please Read Disclaimer