సూపర్ స్టార్ సడెన్ గా బరిలో దిగారు!

0

2020 సంక్రాంతి బరిలో ఠఫ్ ఫైట్ గురించి తెలిసిందే. దాదాపు 300 కోట్ల మేర బెట్టింగుకి ఆస్కారం కనిపిస్తోంది. పందెం పుంజుల నువ్వా నేనా? అంటూ కాపు కాసి కూచున్నాయి. మహేష్ సరిలేరు నీకెవ్వరు.. బన్ని అల వైకుంఠపురములో.. కళ్యాణ్ రామ్ ఎంతమంచి వాడవురా చిత్రాలతో పాటు డబ్బింగ్ చిత్రం దర్బార్ సంక్రాంతి పోటీలో ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా కావడంతో దర్బార్ గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు.

ఇక 2.0 లాంటి భారీ పాన్ ఇండియా సినిమా తర్వాత రజనీ నటిస్తున్న దర్బార్ పై తమిళనాట భారీ బెట్టింగ్ నడుస్తోంది. ఇక ఇరుగు పొరుగున రజనీ మార్కెట్ డౌన్ అవ్వడంతో బజ్ తెచ్చేందుకు చాలానే తంటాటు పడుతోంది లైకా సంస్థ. రజనీ- ఏ.ఆర్.మురుగదాస్ క్రేజీ కాంబినేషన్ అంటూ ప్రచారం ఊదరగొట్టేస్తోంది. ఇక తాజాగా దర్బార్ మోషన్ పోస్టర్ రిలీజ్ విషయంలో చేస్తున్న హంగామా చూస్తుంటే మతి చెడాల్సిందే.

మోషన్ పోస్టర్ రిలీజ్ కోసం ఏకంగా కమల్ హాసన్.. మోహన్ లాల్.. సల్మాన్ లాంటి స్టార్లను బరిలో దించారు. ఆయా భాషల్లో దర్బార్ కి సూపర్ స్టార్లు అంతా ప్రచారం చేస్తుండడం అభిమానుల్లో వేడెక్కిస్తోంది. ఇకపోతే ఇరుగు పొరుగు భాషల్లో అంత పెద్ద స్టార్లు రిలీజ్ చేస్తుంటే తెలుగులో ఎవరూ దర్బార్ ని పట్టించుకోలేదేం? అంటూ విమర్శలొచ్చాయి. నిన్నటి సాయంత్రం నుంచి సామాజిక మాధ్యమాల్లో దీనిపై వాడి వేడిగా డిబేట్ రన్ అయ్యింది. దీంతో ఉన్నట్టుండి సడెన్ గా సూపర్ స్టార్ మహేష్ `దర్బార్` తెలుగు మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేస్తారన్న ప్రకటన వెలువడింది. నేటి సాయంత్రం 5.30కి మహేష్ చేతుల మీదుగా ఈ పోస్టర్ రిలీజ్ కానుంది. అయితే మరీ ఇలా నెటిజనులతో బతిమాలించుకోవాలా? ఎంత కర్మ పట్టింది రా? అంటూ సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.
Please Read Disclaimer