శ్రీముఖిఆర్మీ.. జోరు మీదున్న బ్యాకెండ్ టీమ్

0

బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ల గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్ గా నటి హేమ బిగ్ బాస్ హౌస్ నుండి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఇక హౌస్ లో ఉండే సభ్యులలో అందరూ కలిసి యాంకర్ శ్రీముఖిని టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే బిగ్ బాస్ 3 సీజన్ గెలుచుకునేవారు? అనే ప్రశ్న ఎవరినైనా అడిగితే ఆ పేర్లలో శ్రీముఖి ప్రముఖంగా ఉండడం గమనార్హం.

శ్రీముఖి హౌస్ లోపల సిట్యుయేషన్స్ ను ఎలా హ్యాండిల్ చేస్తోందో కానీ బైట మాత్రం శ్రీముఖి ఒక పర్ఫెక్ట్ సోషల్ మీడియా టీమ్ ను సెట్ చేసుకుందనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే #శ్రీముఖిఆర్మీ సోషల్ మీడియాలో మెల్లగా పాపులర్ అవుతోంది. ఈ ఆర్మీలో ఎక్కువమంది సభ్యులు జాయిన్ అయ్యేందుకు శ్రీముఖి సోషల్ మీడియా టీమ్ తమ వంతు కృషి చేస్తోందట. శ్రీముఖి పాత వీడియోలు షేర్ చేయడం.. శ్రీముఖి అందంగా ఉండే ఫోటో షూట్లకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో పాపులర్ చేయడం.. లాంటివి చేస్తూ శ్రీముఖి ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండేలా ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా బిగ్ బాస్ లో శ్రీముఖికి సంబంధించిన కామెంట్స్.. కొటేషన్లు.. అప్డేట్లు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చూస్తున్నారట.

సెకండ్ సీజన్లో కౌశల్ ఆర్మీ ఏ రకంగా విజేత ను నిర్ణయించేస్థాయికి ఎదిగిందో అదేరకంగా బైట నుంచి శ్రీముఖికి వీలైనంత సపోర్ట్ ఉండేలా చూస్తున్నారట. ఇప్పటివరకూ మిగతా హౌస్ మేట్స్ కు సంబంధించిన టీమ్ ఎవరు కూడా ఈ రేంజ్ లో బ్యాక్ ఎండ్ టీమ్ సెట్ చేసుకోలేదు. మరి ఈ విషయంలో మాత్రం మిగతావారి కంటే శ్రీముఖి చాలా ముందు ఉంది. రోజులు గడిచేకొద్దీ మిగతా సభ్యుల సోషల్ మీడియా టీమ్స్ కూడా యాక్టివ్ అవుతాయేమో వేచి చూడాలి
Please Read Disclaimer