జుట్టు పీక్కుంటున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్

0

తమిళ సూపర్ స్టార్ విజయ్ ఏడాదికి రెండు సినిమాల చొప్పున విడుదల చేస్తూ దూసుకు వెళ్తున్న సమయంలో కరోనా వచ్చి ఆయన ప్లాన్ అంతా తలకిందులు చేసింది. ఈ ఏడాది మాస్టర్ సినిమాతో పాటు మరో సినిమాను కూడా విడుదల చేయాలనుకున్న విజయ్ కి కనీసం మాస్టర్ సినిమాను విడుదల చేసే అవకాశం రాలేదు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు మూతబడి ఉన్న థియేటర్లు మెల్ల మెల్లగా ఓపెన్ అవుతున్నాయి. అయితే ప్రేక్షకులు ఇంకా థియేటర్లకు క్యూ కట్టే పరిస్తితి కనిపిండచం లేదు. అందుకే సినిమాను వచ్చ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఇక మాస్టర్ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ విజయ్ ఫ్యాన్స్ కాచుకు కూర్చున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్ డేట్ దీపావళికి వస్తుందని ఇటీవల తమిళ మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యుల నుండి అధికారికంగా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. దీపావళిక మాస్టర్ టీజర్ వస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ ఇవ్వాలంటూ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ను విజయ్ ఫ్యాన్స్ వేడుకుంటున్నారు.

దీపావళి మరో మూడు రోజులు మాత్రమే ఉన్న కారణంగా ఆయనపై ఫ్యాన్స్ ఒత్తిడి తీసుకు వస్తున్నారు. తమిళ మీడియాలో మాత్రం ఇంకా దీపావళికి మాస్టర్ కానుక ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. దాంతో అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. సినిమా విడుదల సంక్రాంతికి ఉంటుందా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాని కారణంగా మాస్టర్ ను ఇప్పటి నుండే జనాల్లోకి తీసుకు వెళ్లడం వల్ల విడుదల వరకు ఆసక్తి తగ్గే ప్రమాదం ఉందేమో అంటూ యూనిట్ సభ్యులు ఆలోచిస్తున్నారు అంటూ తమిళ సినీ వర్గాల వారి ద్వారా సమాచారం అందుతోంది. తమిళంలోనే కాకుండా ఈ సినిమా తెలుగులో కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.