ఆ క్రేజీ కాంబో… మరో నాలుగేళ్ళ తర్వాతే..!

0

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబుతో చేయనున్నట్లుగా కన్ఫర్మ్ చేశాడు. ఆ సినిమా ఎప్పుడెప్పుడు ఉంటుందని మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా కుడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం జక్కన్న చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా పూర్తీ అయిన తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి మహేష్ బాబు సినిమాను మొదలు పెట్టాల్సి ఉంది. కాని మహమ్మారి వైరస్ కారణంగా సినిమా ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ నిలిచిపోయింది.ఈ ఏడాదిలో ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే పరిస్తితి కనిపించడం లేదు. దాంతో సినిమాను వచ్చే ఏడాది ద్వితియార్ధంలో విడుదల చేసే అవకాశం ఉంది. మహేష్ బాబు సినిమాను మొదలు పెట్టె విషయంలో వచ్చే ఏడాది చివరి వరకు క్లారిటి వచ్చే అవకాశం ఉంది. అంటే సినిమాను జక్కన్న 2022 సంవత్సరంలో ప్రారంభించే అవకాశం ఉంది. జకన్న సినిమా తన ప్రతి సినిమాను కనీసం రెండు సంవత్సరాలు తీస్తాడు.

మహేష్ బాబుతో సినిమాను కుడా తక్కువలో తక్కువ రెండు ఏళ్ళు అయినా తెరకేక్కిస్తాడు. అందుకే సినిమా విడుదలకు కనీసం నాలుగు సంవత్సరాలు అయినా పట్టే అవకాశం ఉంది అంటూ టాక్ వినిపిస్తుంది. ఈ లోపు మహేష్ బాబు కనీసం రెండు మూడు సినిమాలు అయినా చేసే అవకాశం ఉంది. జక్కన్న మహేష్ బాబు కాంబో సినిమా కోసం ఎదురు చూసే వాళ్ళు ఇంకా చాలా కాలం ఆగాల్సిందే.