ఏడో నెంబర్ చెప్పుకు సూపర్ స్టార్ల మద్దతు

0

అదేంటి కాలికేసుకునే చెప్పుకు స్టార్లు మద్దతు పలకడం ఏమిటి ఆస్కార్ అవార్డు ఇవ్వమని చెప్పడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా. పూర్తిగా చదివితే మీకే క్లారిటీ వస్తుంది. జాతీయ అవార్డు గ్రహీత తమిళ హీరో పార్తీబన్ ఇటీవలే ఒతాత సెరుప్పు సైజ్ 7 అనే సినిమా తీశాడు. అంటే తెలుగులో ఏడో నెంబర్ సింగల్ చెప్పు అని అర్థం. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే పార్తీబన్ అన్ని పాత్రలను తనే పోషించడం. కమల్ గతంలో దశావతారం చేశాడుగా అనే సందేహం రావొచ్చు. కానీ కమల్ అందులో ఎన్ని పాత్రలు చేసినా మిగిలిన యాక్టర్స్ చాలా ఉన్నారు.

కానీ ఈ ఒతాతలో పార్తీబనే ఆల్ ఇన్ వన్. ఇంకే నటుడు కానీ నటి కానీ కనిపించరు. ఒకదానితో మరొకటి సంబంధం లేని ఓ డిఫరెంట్ థ్రిల్లర్ ని తనే డైరెక్ట్ చేస్తూ పార్తీబన్ దీన్ని పూర్తి చేశాడు. ఇప్పుడు దీనికి అన్ని రకాల బాషల నుంచి ఆస్కార్ కు నామినేట్ చేయాలంటూ ఏకగ్రీవ మద్దతు దక్కుతోంది. తెలుగులో చిరంజీవి హిందీ నుంచి అమీర్ ఖాన్ తమిళ్ లో రజినీకాంత్ కమల్ హాసన్ దర్శకుడు శంకర్ మలయాళం నుంచి మమ్ముట్టి మోహన్ లాల్ లు అందరూ కలిసి ముక్త కంఠంతో మద్దతు పలుకుతున్నారు.

ఇలాంటి అద్భుత ప్రయోగం చేసిన పార్తీబన్ కు తగిన గుర్తింపు దక్కాలని ఆస్కార్ కు వెళ్లేలా తగిన చర్యలు తీసుకోవాలని వీళ్ళంతా పదే పదే విన్నవిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీత భర్త అయిన పార్తీబన్ తెలుగులోనూ కొన్ని సినిమాలు చేశాడు. రచ్చలో రామ్ చరణ్ తండ్రిగా ఫ్లాష్ బ్యాక్ లో కనిపించేది ఈయనే. ఇప్పుడీ ఒతాత సెరుప్పు సైజ్ 7 వల్ల మరోసారి వార్తల్లోకి వచ్చేశారు. ఇంకా విడుదల కానీ ఈ సినిమాపై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. ప్రపంచం మొత్తంలో ఈ ఫార్మాట్ లో తీసిన సినిమాల్లో ఇది 19వది ఇండియాలో మొదటిది కావడం గమనార్హం.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home