హాటు భామ బ్యాక్ మ్యాజిక్

0

తమిళ సినిమాలతో హీరోయిన్ గా కెరీర్ ఆరంభించి తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన భామ సురభి పురానిక్. తెలుగులో ‘బీరువా’.. ‘ఎక్స్ ప్రెస్ రాజా’.. ‘ఎటాక్’.. ‘ఒక్క క్షణం’.. ‘ఓటర్’ లాంటి సినిమాల్లో నటించింది. ఈ ఢిల్లీ భామ ఇతర న్యూ జెనరేషన్ భామల తరహాలోనే యమా ఫాస్టు. అందుకే ఇన్స్టా గ్రామ ప్రజలను మురిపించేందుకు రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటుంది.

తాజాగా ఈ సురభి క్యాప్షన్ ఏమీ ఇవ్వకుండానే ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఒక టేబుల్ పై కూర్చుని వెనక్కు తిరిగి అందంగా ఓ చిరునవ్వు రువ్వింది. స్లీవ్ లెస్ టాప్ ధరించి.. పైన ధరించాల్సిన డెనిమ్ జాకెట్ ను పక్కనే టేబుల్ పైన పెట్టుకుంది.. దీంతో ఫోటోకు ఓ హాట్ అప్పీల్ వచ్చేసింది. బ్లాక్ & వైట్ ఫోటో కావడంతో కళాత్మకంగా డబ్బూ రత్నాని క్యాలెండర్ ను గుర్తుకుతెస్తోంది. ఈతరం భామలు ఎక్కువమంది జీరో సైజ్ లో ఉంటారు.. కానీ సురభి మాత్రం అలా కరువుప్రాంతవాసిలాగా లేనే లేదు. ముద్దుగా బొద్దుగా కనిపిస్తోంది.

ఈ ఫోటోకు నెటిజన్లు చాలామంది జేజేలు పలికారు. ‘సెక్సీ.. సూపర్ హాట్’.. “ఫ్లాష్ బ్యాక్ ఈజ్ కూల్”.. “క్యూట్ స్మైల్” అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. సురభి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ‘శశి’.. ‘భీమవరం’ అనే సినిమాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-