ఈసారి బ్లాక్ లో మెరిసిన తల్లి కూతురు

0

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి మరియు ఆమె కూతురు సుప్రితలు తెగ వైరల్ అవుతున్నాయి. వీరి టిక్ టాక్ వీడియోలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు కలిసి చేసిన ప్రతి వీడియో కూడా నెటిజన్స్ ను తెగ ఆకట్టుకున్నాయి. లక్షల్లో లైక్స్ మరియు వేలల్లో కామెంట్స్ వచ్చేవి. దాంతో సురేఖ వాణి కూతురు సుప్రిత గురించి చర్చ తెగ జరుగుతోంది. ఈమె వెండి తెరపై కనిపించబోతుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

వెండి తెరపై ఏమో కాని బుల్లి తెరపై మాత్రం సుప్రీత కనిపించబోతుంది. తల్లి సురేఖ వాణితో కలిసి ఒక బుల్లి తెర కార్యక్రమంలో పాల్గొంది. ఆ సందర్బంగా ఇలా ఇద్దరు కూడా బ్లాక్ అండ్ బ్లాక్ లో మెరిశారు. ఎప్పటిలాగే సురేఖ వాణి చీర కట్టులో ఆకట్టుకోగా సుప్రియ మోడ్రన్ డ్రస్ తో కనువిందు చేసింది.

మొత్తానికి ఇద్దరు కూడా బ్లాక్ డ్రస్ లలో పాల రాతి శిల్పాల మాదిరిగా మెరిసి పోతున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ ను పొందారు. మెడ్రన్ తో పాటు అన్ని రకాల కాస్ట్యూమ్స్ లో కూడా సుప్రీత ఆకట్టుకునే విధంగా ఉంది. అందుకే హీరోయిన్ గా సుప్రితను పరిచయం చేయాల్సిందిగా సురేఖ వాణికి పలువురు సలహా ఇస్తున్నారు.