చీరకట్టు వద్దు..పంచెకట్టు ముద్దు అంటున్న సురేఖా ఆంటీ..

0

తెలుగు సినీ ప్రేక్షకులకు సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో హీరో హీరోయిన్లకు తల్లిగా అక్కగా అత్తగా నటించి మెప్పించారు. తెలుగులో చాలా సినిమాల్లో సీనియర్ కమెడియన్స్ పక్కన జోడీగా నటించి కామెడీ పండించి అందరిని అలరించారు. తెలుగు – తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఈ సీనియర్ నటి బుల్లితెర యాంకర్ గానూ పాపులర్ అయింది. సోషల్ మీడియాలో సురేఖ వాణి ఎంత ఆక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే. అటు వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా సంచలనాలు సృష్టించిన సురేఖావాణికి నెటిజన్లలో మంచి క్రేజ్ ఉంది. సమయం ఉన్నప్పుడల్లా వెకేషన్ కి వెళ్తూ.. కూతురుతో కలిసి డాన్స్ లు చేస్తూ ఇంస్టాగ్రామ్ లో వీడియోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటారు. నాలుగు పదుల వయసు దాటిపోయినా.. పెళ్లీడుకొచ్చిన కూతురు ఉన్నా సురేఖా ఆంటీ జోరు మాత్రం తగ్గించడం లేదు. తన కూతురికి పోటీగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఈ వయసులో కూడా వయలుపోతూ ఉంటుంది. కూతురుతో పాటు ఆమె కూడా అందాలు ఆరబోయడానికి రెడీ అయిపోయి రచ్చ రచ్చ చేస్తుంటుంది. ఇంతలా ముందు టబ్ బాత్ చేస్తూ ఫోటో పోస్ట్ చేసిన సురేఖా ఆంటీ.. ఇప్పుడు తాజాగా పెట్టిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సురేఖా వాణి ఈ వీడియోలో తన కూతురు సుప్రీతతో కలిసి పంచె కట్టులో దర్శనమిచ్చింది. డార్క్ బ్లూ కలర్ షర్ట్ ధరించి.. పంచె కట్టు పైకి లేపి.. గ్లాసెస్ పెట్టుకొని ర్యాంప్ వాక్ చేసింది. ‘ఢిల్లీ – 6’ సినిమాలని ‘గేందే పూల్’ సాంగ్ ప్లే అవుతుండగా ఈ తల్లీకూతుళ్లు ఒకరికి మించి ఒకరు వయ్యారాలు పోతూ వాక్ చేసారు. నా కూతురు కంటే నేనేమీ తక్కువ కాదని నిరూపించే ప్రయత్నం చేస్తోంది. ఈ వీడియో చూసిన కుర్రకారు సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సురేఖా ఆంటీకి సమ్మర్ లో చీరకట్టు కంటే పంచె కట్టు సుఖంగా ఉందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు పంచె కట్టులో దర్శనమిచ్చిన ఆంటీ నెక్స్ట్ ఎలాంటి లుక్ తో బయటకి వస్తుందో అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన సురేఖా వాణి తన కూతురుతో కలిసి ఇలాంటి వేడి పుట్టించే వీడియోలను ఫోటోలను అప్లోడ్ చేస్తూ టైంపాస్ చేస్తోంది. సురేఖా ఆంటీ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ పంచెకట్టు వీడియో వైరల్ అయింది.

 

View this post on Instagram

 

A post shared by Surekhavani (@artist_surekhavani) onPlease Read Disclaimer


మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home