భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం - LIVE

నీకంటే వీధి కుక్కలు బెటర్..సురేఖా వాణి ఫైరింగ్!

0

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి గురించిన పరిచయం అవసరం లేదు. తెలుగు-తమిళ చిత్రాల్లో అడపాదడపా అవకాశాలు అందుకుంటున్న ఈ సీనియర్ నటి బుల్లితెర యాంకర్ గానూ పాపులర్. సురేఖ ఎందుకనో ఇటీవల `ఫైర్ యాడెడ్ టు ద పెట్రోల్` అన్న చందంగా చెలరేగడం చర్చకొచ్చింది.

తాజాగా నెటిజనుల నుద్ధేశించి సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇంతకీ ఆవిడ ఏమన్నారు? అంటే. “నీ కంటే వీధి కుక్కలు లైఫ్ ను చాలా బాగా లీడ్ చేస్తాయి“ అంటూ ఓ రేంజులో విరుచుకుపడడం వేడెక్కిస్తోంది. అయితే సురేఖ ఉన్నట్టుండి ఇంతగా ఫైర్ అవ్వడానికి కారణమేమిటి? అంటే.. అందుకు బలమైన రీజనే ఉంది. తనను ఉద్ధేశించి కొందరు నెటిజనులు వల్గర్ కామెంట్స్ చేశారని తెలుస్తోంది. నటిగా ఎంట్రీ ఇచ్చిన తక్కువ టైమ్ లోనే మంచి పేరు తెచ్చుకున్న సురేఖా వాణి దుబాయ్ శీను- బొమ్మరిల్లు- బృందావనం- రెడీ వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంది. అక్కగా.. వదినగా సహాయక పాత్రల్లో సురేఖ అలరించింది.

సోషల్ మీడియాలో తనవైన గ్లామరస్ ఫోటోలతో పోజులిచ్చే సురేఖకు ఇటీవల ఛాన్స్ లు తగ్గాయి. భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మరణించడం… సినిమా అవకాశాలు తగ్గడంతో కొన్ని రోజుల పాటు బాగా డిస్ట్రబ్ అయ్యింది. అయితే సామాజిక మాధ్యమాల వేదికగా తనని అభిమానించే ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటూ తన హాట్ అప్పీల్ విషయంలో అస్సలు వెనక్కితగ్గడం లేదు. తన కూతురు సుప్రీతతో కలిసి ఇటీవల పొట్టి డ్రెస్సులు ధరించి ఫోటోలకు పోజులివ్వడం యువతరంలో చర్చకొచ్చింది. వాటిని తన సామాజిక మాధ్యమాల్లో సురేఖ పంచుకోవడంతో హాట్ డిబేట్ కి తెర తీసింది. దీంతోపాటు కాలా చష్మా.. బుట్టబొమ్మ అంటూ టిక్ టాక్ వీడియోలు చేసి హాట్ టాపిక్ గా మారింది. ఆ వీడియోలు చూశాక.. నెటిజన్లు ఆమెపై పలు వల్గర్ కామెంట్స్ చేయడం ప్రారంభించారు.

“కూతురుతో అలాంటి పనులేంటి? ఆ పొట్టి దుస్తులు వేసుకొని ఆ డాన్సులేంటి?“ అంటూ నెటిజనులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో సంప్రదాయంగా కనిపించే సురేఖా ఇలాంటివి ప్రోత్సహించడంపై నెగిటివ్ కామెంట్ చేశారు. ఒక కూతురిని ఇలా పెంచకూడదని పేర్కొంటూ ఆమెని ఓ ఆట ఆడుకున్నారు. అయితే ఇలా తన వ్యక్తిగత విషయాల్లోకి జొరబడిన వెకిలి జనులపై సురేఖకు మండిపోయింది. ఓ వ్యక్తిని వీధి కుక్కతో పోలుస్తూ ఫైర్ అయ్యింది. “నీ కంటే వీధి కుక్కలు లైఫ్ ను చాలా బాగా లీడ్ చేస్తాయి. నీ ఆలోచనకు హ్యాట్సాఫ్“ అంటూ ఘాటైన వ్యాఖ్యతో వేడెక్కించేసింది. సదరు సీనియర్ నటి తీరు చూసి నెటిజనం బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పుడు అ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-