బిగ్ ఛాలెంజ్.. అఖిల్ కోసం యుద్ధంలో సైనికుడిలా

0

యుద్ధంలో దిగే సైనికుడు ఎలా ఉండాలి? ఆయుధం చేతపట్టి సుశిక్షితుడై శత్రువు మెడ తెగ నరికేందుకు రెడీగా ఉండాలి. ఎటాక్ చేస్తే ఇక ఎదురే ఉండకూడదు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి సన్నివేశం చూస్తుంటే అలానే ఉంది మరి. సూరి యుద్ధంలో సైనికుడిలా పని చేస్తున్నారట అఖిల్ కోసం.

వక్కంతంతో కలిసి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న సురేందర్ రెడ్డి ఒకసారి స్క్రిప్ట్ ని లాక్ చేస్తే ఇక అన్నిటినీ ప్రకటించేస్తాడు. ఇక ఎట్టి పరిస్థితిలో అఖిల్ కి రేసుగుర్రం రేంజ్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ ని అందించడమే ధ్యేయంగా సూరి సర్వ సన్నాహకాల్లో ఉన్నారని తెలిసింది. ఎలాంటి తప్పు జరగకుండా .. ఈ ప్రాజెక్ట్ కోసం తనను తాను సిద్ధం చేసుకుంటూ.. స్క్రిప్ట్.. ఆర్టిస్టులు సాంకేతిక నిపుణుల ఎంపిక విషయంలో అతను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజీకి వచ్చేందుకు సూరి సిద్ధంగా లేడు. తన మార్కెట్ అఖిల్ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని సురేందర్ రెడ్డి అన్ని ప్రీ-ప్రొడక్షన్ పనులను అప్రమత్తంగా చూసుకుంటున్నారు.

స్క్రిప్టు ఫైనల్ అయిపోతే ఇక టైటిల్ ని కూడా ఫైనల్ చేసేయాలన్న ఆలోచన సూరి మైండ్ లో ఉంది. గొప్ప నిర్మాణ విలువలతో ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సహకారంతో సురేందర్ రెడ్డి ఈ ప్రాజెక్టును తెరకెక్కించనున్నారు. ప్రతిదీ ఒక యుద్ధంలో సైనికుడిలా సూరి అన్నీ తానై చూసుకుంటున్నారట.