ఆమెను చూసి సురేందర్ రెడ్డి ఫిదా.. ఛాన్స్ ఇచ్చేశాడా!

0

స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి- అఖిల్ అక్కినేని కాంబోలో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అన్న విషయం మాత్రం కన్ఫామ్ కాలేదు. న్యూ ఫేస్ కోసం సెర్చ్ చేస్తున్న దర్శకుడు.. తన స్పాట్ లైట్ ను ముంబై బ్యూటీపై నిలిపాడు.

మోడలింగ్ లో రాణిస్తున్న ముంబై భామ వైద్యసాక్షిని ఈ మూవీలో తీసుకోబోతున్నారనే వార్తలు ఇటీవల వచ్చాయి. సాక్షి నటించిన కొన్ని యాడ్ ఫిల్మ్లను చూసిన సురేందర్ రెడ్డి.. ఆమె ఇన్స్టాగ్రామ్ పిక్స్ ను కూడా పరిశీలించాడట. ఆ తర్వాత ఆమెను ఆడిషన్ కోసం హైదరాబాద్కు పిలిపించినట్టు సమాచారం. అయితే.. సాక్షిని తీసుకుంటున్నారా? లేదా? అనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు.

కాగా.. సాక్షి నటన సురేందర్ రెడ్డిని ఆకట్టుకుందట. దీంతో అఖిల్ యాక్షన్ థ్రిల్లర్ లో ఆమెను తీసుకోవడం ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండైరెక్టర్ గా బయట పెట్టాడు దర్శకుడు.

ముంబై భామ సాక్షి.. సురేందర్ రెడ్డిని బాగానే ఆకట్టుకున్నట్టుంది. ఆమెపై ప్రశంసలు కూడా కురిపించాడీ డైరెక్టర్. తాను చేయబోయే క్యారెక్టర్ కు మాంచి స్పార్క్ తీసుకొస్తుందని చెప్పాడు. అంతేకాదు.. సాక్షి నేచురల్ పర్ఫార్మర్ అని సర్టిఫికెట్ ఇచ్చేవాడు కూడా. దీంతో.. అఖిల్ మూవీలోకి తనను తీసుకోవడం ఖాయమైపోయిందని చెప్పకనే చెప్పేశాడు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. అనిల్ సుంకర సురేందర్ రెడ్డి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.