బాబు గారు కొరియన్ మూవీస్ పై పడ్డారేం?

0

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో సురేష్ బాబు ఒకరు. ఆయన సినిమాలు చాలా సెలెక్టెడ్ గా చేస్తూ వస్తున్నారు. చిన్న బడ్జెట్ చిత్రాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఎక్కువ లాభాలను దక్కించుకుంటున్నాడు. సురేష్ బాబు నిర్మాణంలో ఈమద్య వరుసగా రీమేక్ లు వస్తున్నాయి. ఆమద్య కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’ ని తెలుగులో ‘ఓ బేబీ’ అంటూ రీమేక్ చేసిన సురేష్ బాబు ఆ తర్వాత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజను కొరియన్ మూవీస్ రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేయించాడు అంటూ ప్రచారం జరుగుతోంది.

సురేష్ బాబు ఈ మద్య కాలంలో చిన్న సినిమాలను కూడా ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం పలు కొరియన్ మూవీస్ ను తెలుగులో రీమేక్ చేసే పని జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ సినిమా తెలుగులో రీమేక్ అవుతుంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రీమేక్ లో రెజీనా కీలక పాత్రలో కనిపించబోతుంది.

ఇక మరో కొరియన్ మూవీ రీమేక్ ని రానా నిర్మిస్తున్నాడు. అల్లరి నరేష్ హీరోగా ఆ రీమేక్ రూపొందబోతుంది. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా మరికొన్ని రోజుల్లో మరో రెండు మూడు కొరియన్ సినిమాల రీమేక్ లు కూడా రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

కొరియన్ మూవీస్ లో కంటెంట్ బాగుంటుంద ని అందుకే ఆ సినిమాలను సురేష్ బాబు ఎంపిక చేసుకుంటున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. మొత్తానికి మంచి కంటెంట్ ఇచ్చే ఉద్దేశ్యంతో సురేష్ బాబు కొరియన్ మూవీస్ ను ఎంపిక చేసుకోవడం మంచిదే అంటూ సినీ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-