దిల్ రాజు రూట్లోనే సురేష్ బాబు ?

0

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ రీమేక్ హాట్ టాపిక్ గా మారింది. అదే ‘అసురన్’ రీమేక్. ధనుష్ హీరోగా వెట్రి మారన్ తెరకెక్కించిన ఈ తమిళ సినిమా అక్కడ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో వెంటనే తెలుగు రీమేక్ రైట్స్ కోసం కొందరు నిర్మాతలు పోటీ పడ్డారు. అయితే ఆ పోటీ మధ్య సురేష్ బాబు వెంకీ కోసం ఆ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. వెంటనే తమిళ నిర్మాత కలైపులి థానుతో కలిసి అసురన్ ని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించేశారు కూడా. అక్కడ వరకూ బాగానే ఉంది. కానీ ఈ సినిమాను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసే డైరెక్టర్ ని ఎంచుకునే విషయంలోనే ఇంకా క్లారిటీ లేదు.

ఇప్పటికే క్రిష్ హను రాఘవపూడి వంటి డైరెక్టర్స్ ని సంప్రదించారనే టాక్ ఉంది. అయితే నిజానికి ఇప్పటి వరకూ డైరెక్టర్ల పేర్లు మాత్రమే పరిశీలించారట ఇంకా ఎవరిని సంప్రదించలేదట. ఇక ’96’ విషయంలోనూ దిల్ రాజుకి ఇదే సమస్య ఎదురైంది. అయితే రీమేక్ కోసం ముందుకు వచ్చిన దర్శకులను పక్కన పెట్టి మరీ ఒరిజినల్ దర్శకుడి చేతిలోనే రీమేక్ ను పెట్టాడు దిల్ రాజు. ఇప్పుడు సురేష్ బాబు కూడా అదే చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇంత పెద్ద హైట్టైయ్యాక కూడా సినిమాను ఇంకా సరిగ్గా తీయలేక పోయాయని చెప్పుకున్నాడు వెట్రి మారన్. అంటే మరో అవకాశం ఉంటే సినిమాను ఇంకా గొప్పగా తీస్తాడేమో. అందుకే సురేష్ బాబు ఇప్పుడు వెట్రి మారన్ ని తెలుగు రీమేక్ కి ఒప్పించే పనిలో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం వెంకీ అమెరికాలో ఉన్నాడు. ఆయన రాగానే దర్శకుడు ఎవరన్నది తేల్చేసి అనౌన్స్ మెంట్ ఇచ్చేస్తారు
Please Read Disclaimer