మళ్లీ విజృంభిస్తున్న సురేష్ బాబు

0

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒక్కరైన సురేష్ బాబు ఈమద్య కాలంలో చిన్న సినిమాలను వరుసగా నిర్మిస్తున్న విషయం తెల్సిందే. చిన్న చిత్రాలను కూడా నిర్మాణ భాగస్వామ్యులతో నిర్మిస్తున్న సురేష్ బాబు చాలా ఏళ్లుగా ఆంధ్రాలో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్న విషయం తెల్సిందే. చిన్న సినిమాలు చాలా వరకు సురేష్ డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా గతంలో విడుదల అయ్యాయి. కొన్నాళ్లుగా సురేష్ డిస్ట్రిబ్యూషన్స్ కాస్త తగ్గినట్లుగా అనిపించింది.

సురేష్ బాబు మళ్లీ చిన్న సినిమాలను వరుసగా పంపిణీ చేసేందుకు ముందుకు వస్తున్నారు. చిన్న సినిమాలకు బయ్యర్లు లభించని కారణంగా ఆ నిర్మాతలంతా కూడా సురేష్ డిస్ట్రిబ్యూషన్స్ కు కమీషన్ ఇస్తూ ఆంధ్రాలో విడుదల చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం చిన్న నిర్మాతలంతా కూడా బయ్యర్ల వెంట పడేబదులు సురేష్ డిస్ట్రిబ్యూషన్ ను ఆశ్రయిస్తే సరిపోతుందని భావిస్తున్నారు. ఆంధ్రాలోని థియేటర్లను సురేష్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఆక్యుపై చేసిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిర్మాతగా దాదాపు డజను సినిమాలను నిర్మిస్తున్న సురేష్ బాబు ఇకపై వరుసగా చిన్న చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ఓకే చెబుతున్నారట. ఆంధ్రాలోని చాలా థియేటర్లను సురేష్ బాబు తన ఆధీనంలో పెట్టుకున్నాడనే టాక్ కూడా వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు సురేష్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తక్కువ కమీషన్ తీసుకునేందుకు ఒప్పుకున్న కారణంగా చిన్న నిర్మాతలు దాదాపు అంతా కూడా సురేష్ బాబునే ఆశ్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Please Read Disclaimer