భారీ బడ్జెట్ ‘హిరణ్య’ ఇంకా లేట్?

0

‘బాహుబలి’ ప్రాంచైజీ స్ఫూర్తితో సురేష్ బాబు నాలుగు భాషల్లో రానాను పెట్టి భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.. హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి గత రెండేళ్లుగా గుణ టీం వర్క్ ఆఫీసులో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇదిగో లాంచ్… అదిగో లాంచ్… అంటూనే నెలలు గడిపేస్తున్నారు.

గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి ఇంకా ఆలస్యం అవుతుందట. లేటెస్ట్ గా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు సురేష్ బాబు. “‘హిరణ్య’ సెట్స్ పైకి రావడానికి ఇంకా చాలా టైం ఉందని తెలిపాడు”. అయితే ఈ ఏడాదిలోనే షూటింగ్ స్టార్ట్ అవ్వడం ఖాయం అన్నట్టుగా ఓ హింట్ వదిలారు. కానీ సురేష్ బాబు మాటల్ని అంత ఈజీగా నమ్మలేం. ఓ మోస్తరు బడ్జెట్ సినిమాకే ఆయన చాలా టైం తీసుకొని అంతా ప్లానింగ్ తో సెట్స్ పైకి వెళ్తారు. అలాంటిది దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ సినిమా అంటే అంత ఈజీగా కానిచ్చేస్తారా ?
Please Read Disclaimer