అయ్యప్ప గుడిలో ఆడాళ్ల ప్రవేశంపై అగ్రనిర్మాత వ్యూ

0

పవిత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించే చట్టాన్ని మార్చాలని కోర్టుల పరిధిలో పోరాటం సాగుతున్న సంగతి తెలిసిందే. ఎంతో పురాతన చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఈ నియమాన్ని పూర్వం నుంచి పాటిస్తూనే ఉన్నా.. ఇటీవల ఎందుకనో కొత్తగా వివాదం రాజేసి దానిని రాజకీయ వివాదంగా మార్చేశారు. అయితే దీనిపై ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంది. అయితే ఒకసారి రెండు సార్లు కాదు.. ఏకంగా 31సార్లు అయ్యప్పను దర్శించుకున్నారు టాలీవుడ్ అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు. శబరిమలకు 32వ సారి వెళుతున్నారు. ప్రస్తుతం కోర్టులో వివాదం నడుస్తున్న సందర్భంగా ఈ విషయంలో ఆయన వ్యూ ఆఫ్ పాయింట్ ఏమిటి? అని అడిగితే.. ఆయన స్పందన ఆసక్తికరం.

“ఆడా మగా అనే లింగ భేధం కంటే ఈ గొడవ కాస్తా రాజకీయం అయిపోవడమే గందరగోళానికి దారి తీస్తోంది. ఇదే ప్రధాన రాజకీయ సమస్యగా మారిపోయింది. ఆడాళ్లు ఎవరూ గుడులు గోపురాలకు సంబంధించిన చట్టాల్ని ఉల్లంఘించేలా పోరాటాలు చేస్తారని నేను అనుకోను. అయ్యప్ప గుడిలో జనాల తాకిడి ఎక్కువ. అక్కడ ఆడాళ్ల ప్రవేశం అన్నది ఆడా మగా ఇద్దరికీ ఇబ్బందికరమైనది. 18 గర్భగుడి మెట్లు దాటుకుంటూ వెళ్లేప్పుడు ఆడా మగా చాలా దగ్గరగా ఒకరినొకరు ఢీకొడుతూ వెళ్లడం అనేది చాలా ఇబ్బందికరమైనది. కోర్టులు ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చినా సమస్య లేదు. ఏదో మహిళలు గుడిలో ప్రవేశించినంత మాత్రాన నేను అయితే ఆగిపోలేను. రుతుక్రమం ఏజ్ లోని ఆడాళ్లు గుడిలో ప్రవేశించారని ఆగిపోలేం“ అని అన్నారు.

అంతేకాదు.. ఆడాళ్లు గర్భగుడిలో ప్రవేశించినంత మాత్రాన ఆ గుడి ప్రాశస్త్యం ఎక్కడికీ పోదు. అయితే ఏవైనా కొన్ని రూల్స్ ఎందుకు పెడతారు? అంటే అది సులువవుతుందని.. మంచి జరుగుతుందని చట్టం చేస్తారు తప్ప ఇంకేదీ కాదు. ఇలాంటి వాటిని రాజకీయాలు చేయొద్దు అని అన్నారు. 32 వ సారి అయ్యప్ప దర్శనానికేగుతున్న గురుస్వామి స్వయంగా చెప్పారు కాబట్టి.. దీనిని స్వాములంతా పరిగణనలోకి తీసుకోవడం తప్పేమీ కాదు.
Please Read Disclaimer