వెంకీమామ.. అందుకే సోలో రిలీజ్?

0

విక్టరీ వెంకటేష్.. అక్కినేని నాగచైతన్య నటిస్తున్న మల్టిస్టారర్ ‘వెంకీమామ’. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు మరో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ విషయంలో గత కొన్ని రోజులుగా కొంత కన్ఫ్యూజన్ నెలకొన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ లోనా.. లేదా జనవరి సంక్రాంతి బరిలో నిలపాలా అనే విషయం సురేష్ బాబు ఆలోచిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఫైనల్ గా డిసెంబర్లోనే రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారట.

డిసెంబర్ 12 న ‘వెంకీమామ’ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందరూ డిసెంబర్ 20 నుంచి 25 లోపల క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ చేస్తుంటే సురేష్ బాబు ఒక పది రోజుల ముందుగా ఎందుకు ఎంచుకున్నారని అనుమానం రావొచ్చు. దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉందట. ఈ సినిమాను ఓవర్ బడ్జెట్ కావడంతో సురేష్ బాబు ఎలాగైనా సోలో రిలీజ్ కోసం ప్రయత్నిస్తున్నారట. అందుకే పోటీలో రిలీజ్ చేయకుండా డిసెంబర్ 12 ను ఎంచుకుంటున్నారట.

ఈ సినిమాను మొదట ప్లాన్ చేసినప్పుడు సురేష్ బాబు అంచనా వేసిన బడ్జెట్ వేరట. అయితే షూటింగ్ పూర్తయ్యేసరికి ఆ బడ్జెట్ రూ.40 కోట్లు దాటిపోయిందట. వెంకీ.. చైతు మార్కెట్ రేంజ్ ని బట్టి చూస్తే ఇది పెద్ద టార్గెట్ అవుతుంది. అందుకే రిస్క్ తీసుకోకుండా సోలో రిలీజ్ అయితే రికవరీ ఛాన్స్ ఎక్కువ ఉంటుందని ఆలోచిస్తున్నారట. ఇక ఈ సినిమా బడ్జెట్ ముందు అనుకున్న దానికంటే ఎక్కువ అయినందుకు దర్శకుడు బాబీ విషయంలో డిజప్పాయింట్ అయ్యారట.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home