‘నారప్ప’పై సురేష్ బాబు వ్యూహం

0

తమిళ్ లో విజయం సాధించిన అసురన్ చిత్రాన్ని `నారప్ప` టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో కథానాయకుడు. మాతృక నిర్మాత కలైపులి.ఎస్.థాను తో కలిసి సురేష్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే అనంతపురంలో ఎలాంటి హడావుడి లేకుండా షూటింగ్ మొదలుపెట్టారు. వెంకటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసి క్యూరియాసిటీ ని పెంచారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్లాపుల్లో ఉన్నా.. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ అయినా అడ్డాలకు అవకాశం ఇవ్వడం వెనక సురేష్ బాబు సరికొత్త స్ట్రాటజీనే ఫాలో చేస్తున్నారన్నది తాజా లీక్.

తానేం చేసినా దాని వెనుక పెద్ద మర్మం ఉండి తీరుతుందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ రీమేక్ విషయంలో సురేష్ బాబు సరికొత్త వ్యూహంతో ముందుకెళుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నారప్ప థ్రిల్లర్ ఫార్మాట్ సినిమా. యాక్షన్ కి ప్రాధాన్యం ఉంది. అందువల్ల వ్యూహం మార్చి ఇద్దరు దర్శకుల్ని బరిలో దించుతున్నారట. ఇందులో ఒకరు బ్యాకెండ్ లో వర్క్ చేస్తారట. వెంకీమామతో చక్కని విజయాన్ని అందించిన బాబి ఈ సినిమాకి యాక్షన్ పార్ట్ ని తెరకెక్కిస్తారట. శ్రీకాంత్ అడ్డాల ప్రధాన దర్శకుడు అయినా.. నారప్పలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను బాబి డైరెక్ట్ చేసే వీలుందని చెబుతున్నారు.

ఈ మూవీలో అత్యంత కీలకమైన మెలోడ్రామా పార్ట్.. టాకీ సహా కీలక షెడ్యూల్స్ కి శ్రీకాంత్ అడ్డాలనే దర్శకత్వం వహిస్తారు. బాబి పని చాలా పరిమితం అని చెబుతున్నారు. ఇక శ్రీకాంత్ ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ సినిమాకి పని చేస్తున్నారు. అతడికి అన్ని రకాలా బాబీ సాయం ఉంటుందిట. ఇటీవల ఏ తెలుగు సినిమాకు ఇద్దరు దర్శకులు పనిచేసింది లేదు. తొలిసారి ఓ స్టార్ హీరో సినిమాకు ఇద్దరు దర్శకులు పని చేయడం ఆసక్తికరం అన్న టాక్ వినిపిస్తోంది. మరి సురేష్ బాబు ద్విముఖ వ్యూహం నిజమేనా? అయితే ఇది ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.
Please Read Disclaimer