థియేటర్ల రీ ఓపెన్ కు సురేష్ బాబు సలహా

0

గత రెండు నెలలుగా షూటింగ్స్ బంద్ అయ్యాయి.. అలాగే థియేటర్లు కూడా పూర్తిగా మూత పడి ఉన్నాయి. షూటింగ్స్ కు అతి త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో థియేటర్లు కూడా ఓపెన్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నెలలో షూటింగ్ ప్రారంభిస్తే వచ్చే నెలలో థియేటర్లు ఓపెన్ చేసే అవకాశం ఉందని కొందరు తమ సినిమాల విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక థియేటర్ల యాజమాన్యాలు సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు.

ఈ సమయంలో ప్రముఖ నిర్మాత.. డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు ఈ విషయంలో స్పందించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ చైనాలో థియేటర్లు ఒకే సారి ఓపెన్ చేసి మళ్లీ క్లోజ్ చేయాల్సి వచ్చింది. అక్కడ సినిమాలు విడుదలకు లేక పోవడం వల్ల ఆ పరిస్థితి తలెత్తింది. అందుకే షూటింగ్స్ ప్రారంభం అయిన కనీసం రెండు నెలల తర్వాత థియేటర్లను ఓపెన్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంను సురేష్ బాబు వ్యక్తం చేశారు.

సినిమాలు విడుదలకు ప్రస్తుతం ఉన్నా అవి కొన్నే అని.. రెండు నెలల తర్వాత ఎక్కువ సినిమాలు విడుదలకు రెడీ అవుతాయి కనుక అప్పుడు థియేటర్లు ఓపెన్ చేయడం వల్ల అన్ని విధాలుగా ఉత్తమంగా ఉంటుందనే అభిప్రాయంను ఈ సందర్బంగా సురేష్ బాబు వ్యక్తం చేశారు. కాని థియేటర్ల యాజమానులు కొందరు మాత్రం ఇప్పటికే చాలా నష్టపోయాం.. వెంటనే థియేటర్ల ఓపెన్ కు అనుమతించండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది… సినీ ప్రముఖుల నిర్ణయం ఏంటీ అనేది చూడాలి.
Please Read Disclaimer