క్రిస్మస్ సీజన్ లో సురేష్ బాబు సపోర్ట్ దబాంగ్ 3 కే!

0

డిసెంబర్ క్రిస్మస్ సీజన్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మారుతి-సాయి ధరమ్ తేజ్ ల సినిమా ‘ప్రతి రోజూ పండగే’ సినిమాను డిసెంబర్ 20 న విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సినిమానే కాకుండా నందమూరి బాలకృష్ణ ‘రూలర్’ ను కూడా ఇదే తేదీన విడుదల చేయాలని చూస్తున్నారు. మరో సినిమా కూడా ఈ రేస్ లో చేరే ఛాన్స్ ఉంది. అయితే ఈ సినిమాలతో మరో బాలీవుడ్ సినిమా పోటీ పడనుంది.. అదే సల్మాన్ ఖాన్ ‘దబాంగ్ 3’.

తెలుగుసినిమాలకే థియేటర్ల విషయంలో పోటీ తప్పదు. అయితే ‘దబాంగ్ 3’ సినిమాకు సీనియర్ నిర్మాత సురేష్ బాబు దన్నుగా నిలుస్తున్నారట. దీంతో సురేష్ బాబు తెలుగు సినిమాలకు కాకుండా సల్మాన్ సినిమాకు థియేటర్లు సర్దుబాటు చేస్తున్నారట. ఇలా అయితే డిసెంబర్ 20 న రిలీజ్ అవుతున్న ఇతర తెలుగు సినిమాలకు థియేటర్ల సంఖ్య తగ్గిపోతుంది. అందుకే ఈ విషయంలో సురేష్ బాబుకు విమర్శలు తప్పడం లేదు.

సురేష్ బాబు నిర్మించిన ‘వెంకీమామ’ కోసం అయితే సోలో రిలీజ్ కోసం ట్రై చేస్తున్నారని.. పట్టుబట్టి మరీ ఎక్కువ థియేటర్లు దొరికే అవకాశం కోసం చూస్తున్నారని.. వేరే తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్న డేట్ లో మాత్రం ఒక హిందీ సినిమాకు సపోర్ట్ ఇవ్వడం సరికాదని అంటున్నారు. మరి సురేష్ బాబుగారు ఈ విమర్శలకు ఏం సమాధానం చెప్తారో ఏంటో!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-