సురేష్ ప్రొడక్షన్స్.. మళ్లీ షోలేస్తున్నారుగా

0

టాలీవుడ్ బడా నిర్మాత – డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు సమర్పణలో అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు వస్తూ వెళ్తుంటాయి. కొత్త వారు తీసిన కొన్ని కాన్సెప్ట్ సినిమాలను ఎంచుకొని మరి రెండు మూడు నెలలకొక సినిమాను రిలీజ్ చేస్తుంటారు సురేష్ బాబు. అలాగే రిలీజ్ కి ముందు తమ స్టూడియోస్ లో కొంత మందిని పిలిచి షోలు వేసి ప్రేక్షకుల మౌత్ టాక్ తో ఫ్రీ పబ్లిసిటీ పొందుతారు.

‘పెళ్లి చూపులు’ – ‘మెంటల్ మదిలో’ – ‘మల్లేశం’ ఇలా కొన్ని సినిమాలు సురేష్ ప్రొడక్షన్స్ నుండి విడుదలైన సినిమాలే.రిలీజ్ కి ముందు రామానాయుడులో ప్రీమియర్లు పడ్డ సినిమాలే. అయితే ఇప్పుడు ‘రాజా వారు రాణి గారు’ అనే మరో చిన్న సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు సురేష్ బాబు. ఇటీవలే సురేష్ ప్రొడక్షన్స్ కి రిలీజ్ అగ్రిమెంట్ అయిపోయింది.

తాజాగా స్టూడియోస్ లో రెండు ప్రీమియర్ షోలు కూడా వేశారు. టీమ్ తో పాటు కామన్ ఆడియన్స్ ఫీడ్ బ్యాక్ తెలుసుకున్నారు. టీజర్ – ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమాతో కిరణ్ అనే కొత్త కుర్రాడు హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకు రవికిరణ్ దర్శకుడు. తనకి కూడా ఈ సినిమా డెబ్యూనే. చాలా తక్కువ బడ్జెట్ లో విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాను నవంబర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నిజానికి ఇటీవలే సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేసిన చిన్న సినిమాలేవి పెద్దగా కలెక్షన్స్ తీసుకురాలేదు. ఒక్క ‘ఫలక్ నుమా దాస్’ సినిమాకు మాత్రమే కొంత వరకూ డబ్బులొచ్చాయి. ఆ సినిమా కూడా లాంగ్ రన్ లో జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ అందుకుంది. మరి ఈ సినిమా అయినా సురేష్ బాబుకి డబ్బులు తెచ్చిపెడుతుందా చూడాలి.
Please Read Disclaimer