వరదల వేళ మరోసారి ఆదుకున్న బ్రదర్స్

0

స్టార్ల సామాజిక సేవా మార్గం అన్ని వేళలా ప్రశంసనీయం. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో మన స్టార్లు స్పందిస్తున్న తీరు ప్రతిసారీ ఆదర్శంగా నిలుస్తోంది. గతంలో తమిళనాడు.. కేరళలో వరదలు ముంచెత్తినప్పుడు టాలీవుడ్ సహా ఇరుగు పొరుగు పరిశ్రమల స్టార్లు విరివిగా విరాళాలు ప్రకటించారు. ప్రస్తుతం మరోసారి దేవతలు నివశించే భూతలంగా భావించే కేరళని వరదలు ముంచెత్తుతున్నాయి. అక్కడ జనాలు ఆవాసాల్ని కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఊళ్ల పైకి వరద ముంచెత్తుతోంది. ఈ ధైన్యం నుంచి కాపాడాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. దీనికి స్పందించి ఇటీవల టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబు ఆర్థిక విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా కోలీవుడ్ నుంచి సూర్య- కార్తీ బ్రదర్స్ స్పందించి 10లక్షల విరాళం ప్రకటించారు. కేరళను వరదలు ముంచెత్తిన సందర్భంగా సూర్య కు చెందిన 2డి ఎంటర్ టైన్ మెంట్ హెడ్ రాజశేఖర్ పాండ్యన్ పది లక్షల చెక్ ని సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించారు. సామాజిక సేవల్లో కోలీవుడ్ బ్రదర్స్ ప్రతిసారీ ముందుకొస్తున్నారు. సూర్య ప్రత్యేకంగా ఓ సోషల్ వర్క్ ఆర్గనైజేషన్ ని నిర్వహిస్తూ పేద విద్యార్థినుల చదువులకు సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే రియల్ హీరోగా అతడికి తంబీల్లో ఇమేజ్ ఉంది. వైపరీత్యాల వేళ అతడు స్పందిస్తున్న తీరు స్ఫూర్తివంతం.

కెరీర్ పరంగా చూస్తే.. సూర్య నటించిన `కాప్పన్` రిలీజ్ కి రెడీ అవుతోంది. కె.వి.ఆనంద్ దర్శకత్వంలో `సూరరై పొట్రు` అనే చిత్రంలో నటిస్తున్నాడు. సుధ కొంగర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్తి నటించిన తాజా చిత్రం ఖైదీ (ఖైథీ-తమిళ్) త్వరలో రిలీజ్ కి రానుంది. అలాగే `సుల్తాన్` అనే చిత్రంలోనూ అతడు నటిస్తున్నారు. అన్నదమ్ములు ఇద్దరూ గత కొంతకాలంగా సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.



Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home