సూర్య కార్తీలు కలిసి నటిస్తున్నారా…?

0

సూర్య – కార్తీ…ఈ అన్నదమ్ములు పరిచయం అక్కర్లేని హీరోలు. అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. వారు నటించే ప్రతీ సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. గజిని – సెవెంత్ సెన్స్ – యముడు – సింగం – సింగం2 – బ్రదర్స్ – 24 మొదలైన సినిమాల ద్వారా తెలుగులో కూడా సూర్య మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. మరోవైపు ఆవారా – ఊపిరి – ఖాకీ – ఖైదీ తదితర చిత్రాల ద్వారా కార్తీ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎప్పటి నుండో డైరెక్ట్ గా తెలుగులో నటిస్తున్నారని వార్తలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఈ అన్నదమ్ములకు సంభవించిన న్యూస్ ఒకటి సినీ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తున్నది.

వివరాల్లోకి వెళ్తే సూర్య కార్తీలు కలిసి ఒక మూవీలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల విడుదలై మలయాళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘అయ్యప్పనం కోసియం’ చిత్రానికి రీమేక్ అని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కతిరేషన్ నిర్మిస్తున్నారంట. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ – బిజూ మీనన్ పోషించిన పాత్రలను తమిళ్ లో సూర్య కార్తీలు చేస్తున్నారంట. ఈ వార్తే నిజమైతే ఎప్పటినుండో ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడలనుకుంటున్న అభిమానులకు శుభవార్త అవుతుంది. కానీ ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు. ఇదిలా ఉండగా సూర్య ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో నటిస్తుండగా కార్తీ పొన్నియన్ సెల్వన్’ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-