మొన్న క్లాస్.. నేడు మాస్ సూర్య

0

తమిళ హీరో సూర్య సక్సెస్ చూసి చాలా కాలమవుతోంది. మూడేళ్లుగా కసిగా ఎదురుచూస్తున్నా ఆ ఒక్కటీ అందని ద్రాక్షే అయ్యింది. ఎంత ఎఫర్ట్ పెట్టినా చివరికి శ్రమ తప్ప ఫలితం దక్కడం లేదు. వరుస పరాజయాలు మార్కెట్ పైనా అంతకంతకు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇదే కొనసాగితే అతడు కేవలం కోలీవుడ్ కే పరిమితం కావాల్సి ఉంటుందన్న విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తాయి. తెలుగులో అతడి మార్కెట్ ప్రస్తుతం జీరోకి పడిపోవడం ఇబ్బందికరంగానే మారింది. ప్రస్తుతం `ఆకాశమే హద్దురా` అనే బయోపిక్ తో సూర్య లక్ చెక్ చేసుకోబోతున్నాడు. ఈసారి కాయా పండా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.

ఇక ఈ సినిమాకు బజ్ తీసుకొచ్చే ప్రయత్నాలు సూర్య గట్టిగానే చేస్తున్నాడు. ప్రచార చిత్రాలతో ప్రేక్షకులందరికీ తెలిసేలా వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు. ఇటీవలే ఎగిరే విమానంలో తొలి లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఆ కార్యక్రమంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా పాల్గొన్నారు. అందులో మోహన్ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా సెకెండ్ లిరికల్ సాంగ్ “సిత్రమైనా భూమి…“ అంటూ సాగే పాటను రిలీజ్ చేసారు. ఇందులో సూర్య పక్కా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.

పాటలో ఊర మాస్ పదాలు కావాల్సినవన్నీ జొప్పించారు. సూర్య మాస్ స్టెప్పులు అభిమానులకు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటను విలేజ్ నేపథ్యంలో చిత్రీకరించారు. రాకేంద్ మౌళి సాహిత్యం అందించగా జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. రాహుల్ సిప్లిగంజ్.. రేవంత్ ద్వయం ఆలపించారు. `గురు` ఫేం సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ డైరెక్టర్ తో పనిచేయడం సూర్యకి ఇదే తొలిసారి కావడం విశేషం. మొత్తానికి మొన్న క్లాస్ సూర్యని…నేడు మాస్ సూర్యని సాంగ్ లో ఎలివేట్ చేయడం విశేషం. త్వరలోనే సినిమా రిలీజ్ కానుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-